టాలీవుడ్ లో ఏ పాత్రకు అయినా సరే ఎప్పుడు అయినా సరే ఏ ఆలోచన లేకుండా ఎంపిక చేసే నటుడు ప్రకాశ్ రాజ్. ఆయన నటనకు ప్రత్యేకంగా ఫాన్స్ ఉన్నారు. ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రకు అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంటాడు ఆయన. పాత్ర ఎలా ఉన్నా సరే తన నటన తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆయన నటన ఉంటుంది అనే సంగతి  అందరికి తెలిసిందే. పాత్ర ఏ విధంగా ఉన్నా సరే జీవించడం ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. ఆయనను కష్టంగా ఉన్నా సరే ఇష్టం గా భరించే అవారు ఎందరో ఉన్నారు అనే చెప్పాలి. 

 

ఇండియన్ సినిమాకు దొరికిన అరుదైన నటుల్లో ఆయన కూడా ఒకరు అనేది వాస్తవం. చాలా తక్కువ కాలంలో మంచి నటుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు అనే విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే  ఆయన హీరో తండ్రి పాత్ర అయినా హీరోయిన్ తండ్రి పాత్ర అయినా సరే జీవిస్తూ ఉంటారు. ఆయన నటించిన అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమాలో ఆయన రవితేజా కు తండ్రి గా నటించారు. ఆ పాత్రలో ఆయన జీవించారు దాదాపుగా అనే చెప్పాలి. ఆ పాత్రలో ఆయన మినహా ఎవరు కూడా చేయలేరు అనే విధంగా తనలో ఉన్న వైవిధ్యం ఆయన స్పష్టంగా తన ఫాన్స్ కి చూపించారు. 

 

సినిమా హిట్ అయింది అంటే ఆయన నటన కూడా ఒక కారణం. కథకు తగిన విధంగా ఆయన ఎంతో అందంగా నటించి మెప్పించారు. ఆ  సినిమాలో ఆయన జయసుధ భర్త గా కూడా నటించారు. ఆ పాత్ర సూపర్ హిట్ కావడంతో అక్కడి నుంచి ఆయనకు మంచి పాత్రలు వరించాయి అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: