టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు అనగానే మనకు చాలా ఫాస్ట్ గా గుర్తుకు వచ్చే నటులు కొందరు ఉంటారు. పాత్ర ఏది అయినా సరే వారు ఆయా పాత్రల్లో చాలా వరకు జీవిస్తూ ఉంటారు. అందులో ముఖేష్ ఋషీ కూడా ఒకరు. పాత్ర ఎలా ఉన్నా సరే ఆయన తన  నటన తో చాలా బాగా నటించడమే కాదు పాత్రకు తగిన అందాన్ని ఒక హుందాతనం తీసుకుని వచ్చే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆయన నటించిన అన్ని సినిమాలు కూడా దాదాపు అదే విధంగా ఉంటాయి అని చెప్పాలి. అగ్ర హీరోల సినిమాలు అయితే ఆయన మరింత అందంగా చేస్తారు. 

 

ఇక ఆయన విలన్ గానే కాకుండా హీరోలకు హీరోయిన్ లకు తండ్రి గా చాలా మంచి పాత్రలు చేసారు. అందులో ప్రధానంగా ఆయన గురించి చెప్పుకునే సినిమా ఇంద్ర. ఆ సినిమాలో ఆయన విలన్  మాత్రమే కాదు తండ్రి కూడా. ఆర్తి అగర్వాల్ కి ఆయన తండ్రి పాత్రలో నటించారు.  ఆ పాత్రలో తన కూతురుని చాలా బాగా ప్రేమించడమే కాదు ఆమె హుందా గా రాయలసీమ అమ్మాయి లా ఉండాలి ఆమె పొగరు అన్నీ చూసి ఆయన చేసిన పాత్ర చాలా బాగా ఆకట్టుకుంది జనాలను. ఆ సినిమా సూపర్ హిట్ కావడం తో ఆయనకు నటుడిగా కూడా మంచి గుర్తింపు వచ్చింది అనే మాట చెప్పవచ్చు.

 

ఇక అక్కడి నుంచి ఆయనకు వరుస ఆఫర్లు వచ్చాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన చాలా మంచి పాత్రలు చేసారు అనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఆయనకు అదే విధంగా డిమాండ్ అనేది ఉంది అనే చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల్లో ఆయనకు మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: