మెగాస్టార్ చిరంజీవి తమ్ముడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం డిగ్రీ కూడా చదువుకోలేదు కానీ పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఇంగ్లీషు తమిళం మలయాళం తెలుగు వంటి భాషల సాహిత్యం పై పట్టు సాధించిన పవన్ కళ్యాణ్ చిన్నతనంలో మాత్రం స్కూల్ పుస్తకాలు ఎక్కువగా చదవలేక పోయేవాడు. కానీ ఇతరత్రా పుస్తకాలు బాగా చదవడం తో అతడు తెలుగు ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా నేర్చుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ అనంతరం చదువుకోక పోవడానికి గల కారణం ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


ఇంటర్మీడియట్ లో MEC చదివిన పవన్ కళ్యాణ్ కామర్స్ సబ్జెక్ట్ లో చాలా వీక్ అట. ఆ సబ్జెక్ట్ ని ఎన్నిసార్లు చదివినా తన మైండ్ కి ఎక్కదట. అందుకే ఆ సబ్జెక్ట్ అంటేనే పవన్ కళ్యాణ్ కి చచ్చేంత భయమట. కామర్స్ ఎగ్జామ్ వస్తుందంటేనే తనకి చెమటలతో షర్టు తడిసి పోయేదట. అందుకే ఇంటర్మీడియట్ లో పవన్ కళ్యాణ్ అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు కానీ కామర్స్ లో ఫెయిల్ అయ్యాడు. ఆ సబ్జెక్ట్ పాస్ కావాలని... ఇంటర్మీడియట్ చదువుని పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు సప్లమెంటరీ లో కామర్స్ ఎగ్జామ్ రాశాడు కానీ ప్రతిసారీ ఫెయిల్ అయ్యాడు.


దీంతో చిరంజీవి పవన్ కళ్యాణ్ కి చదువుపై ఆసక్తి లేదని భావించి అతడిని అల్లు అరవింద్ స్నేహితుడైన ఒక వ్యక్తి వద్ద చేర్పించి నటనలో మెళుకువలు నేర్పించాడు. ఆ తర్వాత కుంపు కరాటే వంటి విద్యలు కూడా నేర్చుకుని ఆయాాా రంగాలలో బ్లాక్ బెల్ట్ వంటివి కూడా సంపాదించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఏదేమైనా జీవితంలో రాణించాలంటే పెద్దపెద్ద చదువులు, డిగ్రీలు అవసరం లేదని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పేసాడు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల కు జన్మించిన పిల్లలని మాత్రం పెద్ద చదువులు చదివిస్తానని రేణుదేశాయ్ మొన్నీమధ్య చెప్పుకొచ్చింది. మరి పవన్ కళ్యాణ్ చదవని పెద్ద చదువులను తన పిల్లలైనా చదువుతారో లేదో చూడాలి.




Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: