నిన్నటి మొన్నటి తరం క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించి ఓవైపు విలన్గా మరోవైపు హీరో హీరోయిన్లకు తండ్రిగా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి విజయవంతమైన నట ప్రస్థానాన్ని కొనసాగించారు రావు గోపాల్ రావు. తెలుగు చిత్ర పరిశ్రమలో రావు గోపాల్ రావు నటనకి... ఆయన డైలాగ్ డెలివరీకి ఫిదా అవని తెలుగు ప్రేక్షకుడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. తన నటనతో అసలుసిసలైన విలనిజం చూపించాలి అన్నా... హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటించి తండ్రి ప్రేమను హావభావాలను పండించాలి అన్నా అది రావు గోపాల్ రావు కే సొంతం అని చెప్పవచ్చు.




అయితే నిన్నటి మొన్నటి తరంలో రావు గోపాల్ రావు ఎంతో మంది హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే రావు గోపాల్ రావు తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైన సినిమా ఘరానా మొగుడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అందాల సుందరి నగ్మా హీరోయిన్ గా నటించిన సినిమాలో నగ్మా  తండ్రి పాత్రలో నటిస్తాడు రావు గోపాల్ రావు. ఒక సాదాసీదా వ్యక్తి అయిన రాజు అనే పాత్రలో నటించిన చిరంజీవి లోని టాలెంట్ను గుర్తించి... తన కంపెనీలో జాబ్ ఇవ్వడమే కాకుండా ఏకంగా తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తారు రావు  గోపాల్ రావు . ఇక ఆ తర్వాత అల్లుడు తో కలిసి కూతురు మనసు మార్చడానికి రావు గోపాల్ రావు చేసే కామెడీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే చెప్పాలి.



నగ్మా తండ్రి పాత్రలో రావు గోపాలరావు నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. మామూలుగానే ఏ పాత్ర ఇచ్చిన రావు గోపాల్ రావు తన నటనతో పాత్రకు ప్రాణం పోస్తారు అన్న విషయం తెలిసిందే. ఇక ఘరానా మొగుడు సినిమాలో  నగ్మా కి తండ్రి పాత్రలో రావు గోపాలరావు నటించి హావభావాలు పలికించిన తీరు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ముఖ్యంగా ఎంతో పొగరుతో ఉండే తన కూతురు ని మార్చేందుకు అల్లుడు తో కలిసి రావుగోపాలరావు వేసే  ఎత్తులు ఎంతగానో ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇలా ఈ సినిమాతో రావుగోపాల్ రావు మరోసారి తనలోని నటుణ్ణి నిరూపించుకున్నారు అని చెప్పాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: