సుశాంత్ సింగ్ రాజ్v‌పుత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్v‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుశాంత్ మరణం తరువాత ఇండస్ట్రీ లోని సమస్యల గురించి సినీ ప్రముఖులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. తాజాగా హీరోయిన్లు కూడా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇండస్ట్రీ లోని ఇబ్బందులు గురించి తమ అనుభవాలను సోషల్ మీడియా వేదిక గా ప్రస్తావిస్తున్నారు.

 

బాలీవుడ్‌ లో వారసత్వం, డామినేషన్ ‌తో పాటు కాస్టింగ్‌ కౌచ్‌ కూడా తీవ్ర ఇబ్బందిగా ఉందని కామెంట్‌ చేసింది హీరోయిన్ అదితి రావ్‌ హైదరీ. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త లో తాను కాస్టింగ్‌ కౌచ్‌ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పింది. అంతేకాదు ఇండస్ట్రీ లో జరుగుతున్న ఈ అన్యాయాలను ఎదురించినందుకే తనను చాలా సినిమాల నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది ఈ బ్యూటీ.

 

బ్యూటీ నటించిన మూవీ సుఫియమ్‌ సుజాతయుమ్‌ సినిమా తో డిజిటల్‌ ద్వారా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ డిజిటల్‌ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా కాస్టింగ్‌ కౌచ్‌ కారణం గా ఇండస్ట్రీ లో చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని , కొంత మంది ఈ సమస్యల నుంచి తప్పించుకుంటే మరికొందరు మాత్రం వేదింపులు భరించలేక ఇండస్ట్రీ ని వదిలేస్తున్నారని చెప్పింది.

 

ఇండస్ట్రీ లో డామినేషన్‌ కూడా ఎక్కువగా ఉందన్న అదితి, ఈ ఆదిపత్యాన్ని క్వశ్చన్ చేసిందుకే తనను చాలా సినిమాల నుంచి తీసేశారని  చెప్పింది. అవకాశాలు లేక నెలల తరబడి ఖాళీ గా ఉండాల్సి వచ్చిందని తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: