తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రం తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న వారు ఉంటారు. ఇలా ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు సంపాదించి ప్రస్తుతం హీరోయిన్లకు తండ్రి పాత్రలు చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఇలా హీరోయిన్లకు తండ్రి పాత్రలు చేస్తూ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ పాత్రలకు ప్రాణం పోసే నటుల్లో ఒకరు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్రప్రసాద్ ఒకప్పుడు హీరోగా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపుగా నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు, ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు రాజేంద్ర ప్రసాద్.


అయితే ఇప్పటివరకు రాజేంద్రప్రసాద్ ఎన్నో సినిమాలలో హీరోయిన్లకు తండ్రి పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఆయన. అయితే ఇప్పటివరకు రాజేంద్రప్రసాద్ ఎంతో మంది హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటించినప్పటికీ రాజేంద్రప్రసాద్ కి ఎక్కువ గుర్తింపు తెచ్చిన పాత్ర మాత్రం మహానటి సినిమా లోని సావిత్రి తండ్రిగా నటించిన పాత్ర. తెలుగు చిత్ర పరిశ్రమలో  తన నటనతో ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించి... తన సేవా భావంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటి సావిత్రి. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి.



 ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా..  సావిత్రి తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించారు. సావిత్రికి రాజేంద్రప్రసాద్ పెదనాన్న అయినప్పటికీ తండ్రి లాగే చిన్నప్పటినుంచి ఆలనాపాలనా చూసేవారు. తన కూతురిని పెద్ద నటిని చేయాలన్న సంకల్పంతో రాజేంద్రప్రసాద్ ఎన్నో కష్టాలు పడి.. మద్రాసు వెళ్లి సినిమా ప్రముఖుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక సావిత్రి అంత గొప్ప నటిగా మారడానికి మూలకారణం ఆమె తండ్రి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సావిత్రి తండ్రిగా రాజేంద్రప్రసాద్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల మనుసుని తాకాయి  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా సావిత్రి తండ్రి పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: