కరోనా దెబ్బకు దేశంలోని సినీ పరిశ్రమ బాగా కుదేలైపోయింది. అన్ని భాషల సినీ పరిశ్రమలదీ ఒకటే పరిస్థితి. షూటింగ్స్ లేవు, కొత్త సినిమాల రిలీజ్ లేదు. ప్రస్తుత పరిస్థితులు ఎప్పుడు చక్కబడి ధియేటర్లు తెరుస్తారో అని పరిశ్రమ ఎదురుచూస్తోంది. తెరిచినా ప్రేక్షకులు వస్తారా.. గతంలో మాదిరిగా ఆదరణ ఉంటుందా అనే ప్రశ్న కూడా వారి మదిని తొలిచేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ సినిమా పరిశ్రమ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారీగా పెరిగిపోతున్న సినిమా ఖర్చులను తగ్గించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇందుకు తమిళ నిర్మాతల మండలి ఓ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

IHG

 

నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్ నుంచి దాదాపు 50శాతం కోత విధించాలని తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జూలై 7న వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిపిన ఈ సమావేశంలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. నిర్మాత ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ.. ‘పెద్ద నటుల నుంచీ చిన్న నటుల వరకూ రెమ్యునరేషన్ తగ్గించేలా నిర్ణయం తీసుకున్నాం. కొందరికి 50 శాతం.. మరికొందరికి 20 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది మా మొదటి ఎజెండా. దీనిపై మరింతగా చర్చలు జరుపుతాం. ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గించేందుకు ప్రణాళికలు వేస్తాం. నిర్మాతలకు భారం తగ్గించాలనేదే తమ ఆలోచన’ అని చెప్పుకొచ్చారు.

IHG

 

ఇప్పటికే దర్శకులు అజయ్ జ్ఞానముత్తు, హరి, విజయ్ ఆంటోనీ.. తదితరులు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవటానికి ముందుకొచ్చారు. ఇప్పుడీ విషయం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ నిర్ణయంపై తెలుగు సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి. హీరోల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ ప్రతిచోటా ఎక్కువగాను ఉంది. మరి ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి తెలుగు సినీ ప్రముఖులు ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సిందే.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: