టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇప్పుడు చాలానే చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న నేపధ్యంలో రెండు ఫ్యామిలీ లకు చెందిన ఫాన్స్ ఎంతో ఈ సినిమా కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఈ సినిమా దర్శకుడు రాజమౌళి కూడా కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో వారి పాత్రలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద కూడా సర్వత్రా ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఇక వారు ఇద్దరూ ఈ సినిమాలో  అన్నా తమ్ముళ్ళు గా నటిస్తున్నారు అనే విషయం అయితే స్పష్టత వచ్చింది ఇప్పటికి. 

 

ఇక ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై చాలా వరకు కూడా అభిమానుల్లో అసహనం ఉంది అనే చెప్పాలి. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ముందు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8 న విడుదల అయ్యే అవకాశం ఉందని అన్నారు. కాని ఆ సినిమా వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి కి విడుదల అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. అప్పుడు a సినిమాను విడుదల చేయడానికి గానూ సిద్దమవుతుంది  చిత్ర యూనిట్ అని టాక్.  వచ్చే ఏడాది మే వరకు సినిమా షూటింగ్ ఉండే అవకాశం ఉంది. 

 

లాక్ డౌన్ లో దాదాపుగా సినిమా ఆగిపోయినా సరే ఇతర పనులు మాత్రం కాస్త వేగంగా జరుగుతున్నాయి. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అనేది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్స్ గురించి కూడా కాస్త ఎక్కువగానే ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. వారు ఇద్దరూ కూడా సినిమా షూటింగ్ కి వచ్చే అవకాశం లేదనే ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది చూడాలి. అలియా బట్ కూడా షూట్ కి వచ్చే అవకాశం లేదని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: