జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సుడిగాలి సుధీర్ చాలా సంవత్సరాల పాటు హాస్యనటుడిగా అలరిస్తూనే ఉన్నాడు. ఈటీవీ లో ప్రసారమవుతున్న ఢీ డ్యాన్స్ షో తో పాటు పోవే పోరా కార్యక్రమంలో కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ రెండు చేతిలా డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలో హీరోగా కూడా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో కథాబలం లేదు కానీ తనకిచ్చిన పాత్రలో చక్కగా నటించి అభిమానులను అలరించాడు సుధీర్. ఈ సినిమా కంటే ముందు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను తో కలసి త్రీ మంకీస్ సినిమాలో హీరోగా నటించాడు సుడిగాలి సుధీర్. అయితే ఈ సినిమా కూడా కథ మంచిగా లేక అంతంతమాత్రమే ఆడింది. కానీ అభిమానులు మాత్రం సుడిగాలి సుధీర్ ని వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.


సుడిగాలి సుధీర్ హీరోగా రెండు చిత్రాల్లో మాత్రమే నటించాడు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో కనిపించి అందరినీ కడుపుబ్బ నవ్వించాడు. సినిమా చూపిస్త మామ, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్లాక్ బాస్టర్ హిట్ అయిన అత్తారింటికి దారేది సినిమా లో కూడా అతి చిన్న పాత్ర వేసి తన అభిమానులని సంతోషపరిచాడు. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, హైపర్ ఆది కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ డబ్బులను సంపాదిస్తున్నారు. సినిమాల్లో కేవలం హీరోయిన్లు మాత్రమే నటించకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో నటించడానికి సుడిగాలి సుధీర్ కూడా ఆసక్తి చూపుతున్నాడు.


అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో సుడిగాలి సుధీర్ కీలకమైన పాత్రలో నటించనున్నాడట. ఈ చిత్ర బృందం జబర్దస్త్ ఫేమ్ ఉపయోగించుకొని సినిమాలో బాగా నవ్వులు పూయించి హిట్ అందుకోవాలని భావిస్తున్నారట. అందుకే సుడిగాలి సుధీర్ కి ఒక కీలకమైన పాత్ర ఇచ్చారట. అఖిల్ అక్కినేని స్నేహితుడిగా సుడిగాలి సుధీర్ కనిపించబోతున్నాడని సినీ వర్గాల నుండి వినిపిస్తుంది. ఈ విధంగా కేవలం హీరో పాత్రలో మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాలన్న తెలివైన నిర్ణయం తీసుకున్నాడు సుడిగాలి సుధీర్.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: