కరోనా సినిమా ఇండస్ట్రీని అల్లకల్లోలం చేసినా.. నాగార్జునకు వచ్చిన కష్టం ఏమీ లేదు. కరోనాతో సంబంధం లేకుండా.. ఆయనకు రావాల్సింది ఆయనకు వచ్చేసింది. కరోనా తర్వాత బడ్జెట్ కంట్రోల్.. రెమ్యునరేషన్ తగ్గించుకోవడంపై చర్చ నడుస్తున్నా.. ఆ ప్రభావం నాగార్జునపై పడలేదు. 
సోగ్గాడే చిన్నినాయన తర్వాత ఒక్క హిట్ లేని నాగార్జున కు ఎవరూ ఊహించని రెమ్యునరేషన్ దక్కింది. 

 

నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ మూవీలో నటిస్తున్నాడు మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టినా.. ఈ లోగా ..  బిగ్ 4 సీజన్ లో జాయిన్ అవుతాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ మొదలైంది. రెండో సీజన్ కు నాని ఆధ్వర్యంలో జరుగగా.. మూడో సీజన్ కు నాగార్జున హోస్ట్ గా ఉన్నాడు. నాలుగో సీజన్ కు కూడా నాగార్జునే యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. 

 

కరోనా ఎఫెక్ట్ నాగార్జున రెమ్యునరేషన్ పై ఏమాత్రం పడలేదు. కరోనా దెబ్బకు బడ్జెట్ తగ్గించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నటీనటుల రెమ్యునరేషన్ కూడా తగ్గించాలన్న ప్రతిపాదన పెట్టారు. అయితే.. బిగ్ బాస్ నాలుగో సీజన్ వ్యాఖ్యాత నాగార్జున పారితోషికంపై పడలేదు. మూడో సీజన్ కోసం ఎపిసోడ్ కు 12క్షలు తీసుకున్నాడని.. ఇపుడు కూడా అదే అమౌంట్ ఇస్తున్నారట్. 

 

కరోనా వచ్చిన తర్వాత స్టార్స్ కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడంతో.. రెమ్యునరేషన్ తగ్గిందా.. లేదో తెలియదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోత తప్పడం లేదు. అయితే.. బిగ్ బాస్ నాలుగో సీజన్ హోస్ట్ గా నాగార్జున రెమ్యునరేషన్ కు వచ్చిన ముప్పేమీ లేదు. మూడో సీజన్ లో ఇచ్చినంతే ఇస్తున్నారట. కరోనా టైమ్ లో షూటింగ్ లు లేక.. సినిమాలు ఆడక.. వ్యాపారాలు జరుగక అన్ని రంగాలు కుదేలయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జునకు మాత్రం అధృష్టం వెతుక్కుంటూ వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: