టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా 1990లో తెరకెక్కిన శివ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయయ్యాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అంతకముందు పలువురు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన అనంతరం శివ తో దర్శకుడిగా మరి, తొలి సినిమాతోనే అత్యద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత నుండి తెలుగులో మరిన్ని మంచి విజయాలు అందుకున్న వర్మ, ఆపై బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా పలువురు అగ్ర హీరోలతో సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మించాడు. ఆ విధంగా విజయవాడ కుర్రాడైన వర్మ, ముంబై వెళ్లి బాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకుని తెలుగు వారి పేరు మరింతగా పెంచాడు. 

IHG

అయితే ఇటీవల కొన్నేళ్లుగా పలు వివాదాస్పద అంశాలు ఎంచుకుంటూ సినిమాలు తీస్తున్న వర్మ, వాటి ద్వారా వరుసగా ఫ్లాప్స్ చవిచూస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం మరొక్కసారి ఒక వివాదాస్పద టైటిల్ తో కూడిన సినిమాతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పవర్ స్టార్ పేరుతో వర్మ తీస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇటీవల జనసేన పార్టీ పెట్టి మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే తమ సినిమా మాత్రం ఎన్నికల తరువాత జరిగిన స్టోరీ అని అంటున్నారు వర్మ, కాసేపటి క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. 

 

అలానే చిరంజీవి, పవన్ స్పూఫ్ లు ఇద్దరూ కలిసి కూర్చున్న తన సినిమాలోని మరొక ఫోటోని కూడా వర్మ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఫోటోని బట్టి చూస్తుంటే, కేవలం పవన్ నే కాకుండా మెగాస్టార్ చిరంజీవిపై కూడా వర్మ కొంత వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నట్లు తెలుస్తోంది. తనని తాను మెగాస్టార్ కు, పవర్ స్టార్ కు పెద్ద ఫ్యాన్ ని అని చెప్పుకునే వర్మ, ఈ విధంగా వారిని టార్గెట్ చేస్తూ సినిమా తీయడం ఏంటో తమకు అర్ధం కావడం లేదని కొందరు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తుంటే, మెగా ఫ్యాన్స్ మాత్రం వర్మపై విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: