టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జనాలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. మెగా హీరో  నందమూరి హీరో చేయడం తో ఈ సినిమా ఇప్పుడు ఒక రేంజ్ లో సంచలనంగా మారింది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కోసం చాలా ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఈ సినిమాను ఏ విధంగా తీసుకుని వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నటించే నటులు ఈ సినిమా కథపై సర్వత్రా ఆసక్తి ఉంది. ఇక ఈ సినిమాలో ఇప్పుడు షూటింగ్  పెద్ద సమస్యగా  మారింది. 

 

కొన్ని కొన్ని సన్నివేశాలను  ఈ సినిమాలో లేట్ గా షూట్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో జక్కన్న కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనే ప్రచారం సినీ వర్గాల్లో జరుగుతుంది. ఈ సినిమా హీరోయిన్ లను మార్చడం తో పాటుగా రీ షూట్ చెయ్యాలి అనే సన్నివేశాలను ఇక వద్దు అని భావించారు అని టాక్. రీ షూట్ సన్నివేశాలు వద్దని చెప్పాడట రాజమౌళి. ఖర్చు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ఆలోచన విరమించుకున్నా అని ఆయన చెప్పడం తో అటు నిర్మాత  కూడా ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. 

 

ఈ సినిమాలో హీరోయిన్ ల విషయంలో కూడా టాలీవుడ్ లో ఇప్పుడు అనేక వార్తలు వస్తున్నాయి. ఒలివియా మోరిస్ తో పాటుగా అలియా భట్ ఇద్దరూ కూడా  కాస్త దూరంగా ఉండే అవకాశం ఉంది అని వేరే వారిని తీసుకునే సూచనలు ఉన్నాయి అని కథనాలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం ఏంటీ అనేది చూడాలి. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: