టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల కోసం జనాలు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. సినిమా వస్తే చాలు పండగ అనే విధంగా ఉంది పరిస్థితి. ఇక సినిమాలను తీసుకుని రావడానికి దర్శక నిర్మాతలు కూడా నానా రకాల కష్టాలు పడుతున్నా సరే లాక్ డౌన్ దెబ్బ కేసులు భారీగా రోజు రోజుకి పెరగడం కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఈ లాక్ డౌన్ లో చాలా బాగా ఇబ్బంది పడుతుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది కూడా విడుదల చేసే అవకాశం లేదు అనే వార్తలు వస్తున్నాయి. 

 

కనీసం సినిమా విడుదల చేయడానికి రెండేళ్ళ పైగా పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక ఈ లోపు మహేష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అనే టాక్ వస్తుంది. అవును మహేష్ బాబు మరో సినిమాను లైన్ లో పెట్టే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. ఇప్పుడు  మహేష్ బాబు అనీల్ రావిపూడి తో మాట్లాడుతున్నాడు అని ఒక చిన్న సినిమాను అతను చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్ వస్తుంది. ఆ సినిమాకు సంబంధించి కథ మహేష్ ఎప్పుడో విన్నాడు అని కూడా సమాచారం. 

 

త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తి స్థాయి నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్  ఏ  పాత్ర పోషించే అవకాశం ఉంది అనేది మాత్రం తెలియదు గాని ఇది ఒక థ్రిల్లర్ అని టాలీవుడ్ లో అంటున్నారు. త్వరలోనే ఒక ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: