టాలీవుడ్ లో ఒకప్పుడు కొందరు కమెడియన్ ల పేరు వినగానే జనాలు నవ్వే వారు. అలాంటిది ఇప్పుడు అసలు సినిమాల్లో ఆ మాట వినపడటం లేదు. ఎక్కడో ఒక సినిమాలో మినహా దాదాపు సినిమాల్లో హీరోలు కామెడి చేయడం లేదా హీరోయిన్ కామెడి చేయడం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే దాదాపు అదే విధంగా ఇప్పుడు సినిమాల పరిస్థితి ఉంది అనే చెప్పాలి ఏ హీరో సినిమాలో అయినా సరే కమెడియన్ అనేది ఉండటం దాదాపుగా కష్టంగా మారింది అనే చెప్పాలి. 

 

ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటీ బ్రహ్మానందం లాంటి నటుడు కూడా ఇప్పుడు సినిమాల్లో కనపడటం లేదు. అయితే ఆయన సినిమాలకు దూరం అయ్యారు అని అంటున్నారు. ఆయన సినిమాల్లో మంచి ఆఫర్లు వచ్చిన సరే చేయడానికి ముందుకు రావడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. మరి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆయన కథ వినడం లేదు ఆయనకు కథ కూడా ఎవరూ చెప్పడం లేదు అని సమాచారం. ఆయన కథ ఇటీవల ఒకటి విన్నా సరే పాత్రకు ప్రాధాన్యత ఉన్నా సరే ఆయన మాత్రం సినిమాలో చేయడం లేదు. 

 

హీరో సినిమా అయినా సరే తాను దాదాపుగా సినిమాలకు దూరంగానే ఉన్నారు. ఇటీవల ఏదో వార్త వచ్చింది గాని దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చేసారు. తాను సీరియల్స్ చేయడం లేదు అని పుస్తకాలు చదువుతూ టైం పాస్ చేస్తున్నా అని ఆయన చెప్పారు. అంటే ఆయన ఇక సినిమాలకు షూటింగ్ కి దాదాపుగా దూరంగా ఉన్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. మరి  ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి ఇక.

మరింత సమాచారం తెలుసుకోండి: