టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా పాపులర్ అయింది రష్మిక మందన. కన్నడం నుంచి వచ్చి ఆమె పాపులర్ అయిన విధానం ఇక్కడ సినిమాలు చేసిన విధానం చేస్తున్న విధానం చాలా మంది హీరోయిన్ లకు కాస్త షాక్ గానే ఉంది అనే చెప్పాలి. స్టార్ హీరోల తో ఆమె వరుసగా సినిమాలు చేయడమే కాదు వాటిని హిట్ కూడా కొడుతుంది. ఇప్పుడు ఆమెకు మన తెలుగు లో చాల ఆమంచి డిమాండ్ ఉంది అనే చెప్పాలి. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఆమె మాత్రం ఏ విధంగా కూడా వెనక్కు తగ్గడం లేదు అనే చెప్పాలి. 

 

ఇక ఇప్పుడు ఆమె నానీ తో కలిసి ఒక సినిమాను ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాలో నానీ తో పాటుగా నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. నిజమా కాదా అనేది తెలియదు గాని దీనిపై మాత్రం ఆమె ఒక కథ కూడా నానీ కి ఇచ్చింది అని ఇద్దరం కలిసి లో బడ్జెట్ లో చేద్దాం అని ఆమె నుంచి నానీ కి ఫోన్ వచ్చింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. నానీ ప్రస్తుతం ఒక రెండు సినిమాలు చేస్తున్నాడు. 

 

ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా లాక్ డౌన్ లో ఆగిపోయింది. ఇక ఒక సినిమా దాదాపుగా విడుదలకు రెడీ గానే ఉంది. మరి రష్మిక ప్రాజెక్ట్ అసలు అతను ఎప్పుడు చేసే అవకాశం ఉంది అనేది త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నానీ నటిస్తున్న వీ సినిమా అన్నీ పూర్తి చేసుకుని విడుదల దగ్గర ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: