3 సక్సెస్ ఫుల్ జీనలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఎప్పుడెప్పుడా అని బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలందరు ఎవరికి వారు తమ హౌజ్ నే బిగ్ బాస్ హౌజ్ గా చేసుకుని ఉండాల్సి వచ్చింది. అందుకే రానున్న బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్ యొక్క ఎమోషన్ ను అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4కి సంబందించిన కంటెస్టంట్స్ అంతా ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈసారి స్టార్ సెలబ్రిటీస్ ను ఎక్కువ మొత్తం ఇచ్చే హౌజ్ లోకి తీసుకున్నారట. ఇక హోస్ట్ గా కూడా మరోసారి కింగ్ నాగార్జుననే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

 

బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా నాగార్జున అదరగొట్టారు. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్, సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా చేశాడు. ఇక మూడవ సీజన్ గా నాగార్జున యువ హీరోలకు ధీటుగా ఇంకా చెప్పాలంటే వాళ్లకంటే బెటర్ గా హోస్ట్ గా అలరించాడని చెప్పొచ్చు. తారక్ మొదటి సీజన్ దుమ్ముదులిపేయగా సెకండ్ సీజన్ నాని జస్ట్ ఓకే అనిపించాడు.. నాగ్ మాత్రం హోస్ట్ గా ఆల్రెడీ అనుభవం ఉండటంతో ఆకట్టుకున్నాడు. ఇక సీజన్ 4 కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. 

 

రెమ్యునరేషన్ కూడా బిగ్ బాస్ సీజన్ 3కి ఇచ్చినట్టుగానే భారీ మొత్తంలో ఇస్తున్నారట. సీజన్ 3 టైం లోనే రెండు సీజన్లను కలిపి రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారట. అయితే కరోనా క్రైసిస్ వల్ల రెమ్యునరేషన్ తగ్గించుకుంటాడేమో అనుకోగా ఈ టైం లో షో చేయడం కష్టం కాబట్టి నాగార్జున అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్నారట. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 4 అదరగొట్టేందుకు రెడీ అవుతుంది. మరి ఈ షోలో సెలబ్రిటీస్ ఎవరు కంటెస్టంట్స్ గా వస్తారో త్వరలో తెలుస్తుంది. ఆగష్టు చివరి వార్లో కాని సెప్టెంబర్ మొదట్లో కాని ఈ షో మొదలు అవబోతుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: