చిరంజీవి మెగాస్టార్. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా టాలీవుడ్  నంబర్ వన్. ఆయన మాట వినాలని, ఆయన ఫోటో చూడాలని ఇప్పటికీ పడిచచ్చే ఫ్యాన్స్ భీభత్సంగా ఉంటారు. అటువంటి మెగాస్టార్ ఇపుడు అద్రుశ్యం అయ్యారు. ఏకంగా ఇరవై రోజులుగా కనిపించడంలేదు.

IHG's demise saddens <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHIRANJEEVI' target='_blank' title='megastar-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>megastar</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHIRANJEEVI' target='_blank' title='chiranjeevi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>chiranjeevi</a> - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> ...

ఎక్కడ ఎందుకు అంటే అక్కడే అందుకు అని సమాధానం వస్తుంది. మెగాస్టార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రతీ రోజూ  హెలో అని చెబుతూ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించారు. ఆయన మార్చి 25వ తేదీన ఉగాది పండుగ వేళ తన కొత్త యాక్టివిటీని మొదలెట్టారు. అదే సోషల్ మీడియాతో డైరెక్ట్ కనెక్టివిటీ అన్న మాట.

IHG

ఆ రోజు నుంచి మెగాస్టార్ మోత మోగించారు. ప్రతీ సందర్భాన్ని ఆయన చక్కగా ఉపయోగించుకున్నారు. అది సినిమా నటుల పుట్టిన రోజులు అయినా పండుగలు అయినా ముఖ్యమైన ఈవెంట్స్ అయినా కూడా తన ట్వీట్లను చేస్తూ వచ్చారు. వీడియోలు కూడా పెడుతూ సందడి చేశారు. ఇక కరోనా టైంలో ఇంట్లో దోసెలు వేసిన వీడియోతో పిచ్చ కాక రేపారు.

IHG

ఇన్ని చేసిన మెగాస్టార్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ట్విట్టర్ ఖాతా ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా ఆయన ఖాతాలో చివరి పోస్ట్ కనిపించింది. ఆ తరువాత ఒక్క పోస్ట్ కూడా లేదు. ఈ మధ్యలో ఎన్నో పరిణామాలు జరిగాయి కానీ మెగా ట్వీట్టర్ కూత మాత్రం లేదని అభిమానులు తెగ ఇదైపోతున్నారు. మరి మెగాస్టార్ ఎందుకు సైలెంట్ అయ్యారో ఏమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ కరోనా వేళ, ఈ ఇబ్బందుల వేళ తమ అభిమాన స్టార్ ముచ్చట్లు చూసుకుని మురిసేవారు. ఇపుడు అదీ లేదని ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మెగా ట్వీట్  కోసమే వేచి చూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: