రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి రిలజై నేటితో 17ఏళ్లు పూర్తయ్యాయి. 2003 జూలై 9న విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఆ హిట్టుని ఇండస్ట్రీ హిట్ అని ఎన్టీఆర్ అభిమానులు.. కాదని మిగిలిన హీరోల అభిమానుల మధ్య ఎప్పటినుంచో వాదనలు జరుగుతున్నాయి. ఇప్పుడిదే చర్చ మరోసారి ఎన్టీఆర్ అభిమానులు ఇతర హీరోల అభిమానుల మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతోంది.

IHG

 

సింహాద్రి విడుదలై 17 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ #17YearsForIHSimhadri అనే హ్యాష్ ట్యాగ్ రిలీజ్ చేశారు. దీనిపై మళ్ల ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ అని కలెక్షన్లు, 100, 175 డేస్ సెంటర్ల వివరాలు చూపిస్తున్నారు. అయితే దీనికి ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ కౌంటర్ వేస్తున్నారు. ఆమధ్య ఓ చానెల్ లో రాజమౌళి సింహాద్రి 175సెంటర్స్ రికార్డు కోసం కావాలని ఆడించారని, ఆ సెంటర్స్ లో సగం ఫేక్ అని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను యాంటి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కలెక్షన్ల పరంగా 4వ స్థానంలో ఉందని అంటున్నారు.

 

చిరంజీవి ఇంద్ర 33కోట్లు, పవన్ కల్యాణ్ ఖుషి 24కోట్లు, బాలకృష్ణ 22కోట్లు.. తర్వాత స్థానంలో ఎన్టీఆర్ సింహాద్రి 20కోట్లతో నాలుగో స్థానం మాత్రమే అని ట్వీట్లు చేస్తున్నారు. క్రిటిక్స్, సినీ జర్నలిస్టులు తయారు చేసిన ఇండస్ట్రీ హిట్ లిస్టులో కూడా సింహాద్రి లేదని పోస్టులు చేస్తున్నారు. ఈరోజంతా ఈ ట్వీట్లు రౌండ్ అవుతూనే ఉన్నాయి. మొత్తంగా ఎన్టీఆర్ కి సోలోగా ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా లేదనేది వారి వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా సింహాద్రి బ్లాక్ బస్టర్ గా నిలిచి ఎన్టీఆర్ కెరీర్ కు బూస్టప్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: