మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండేళ్ల క్రితం, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా చేసిన చరణ్, దానితో భారీ డిజాస్టర్ ని చవిచూశాడు. ఇక ఆపై రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా సైన్ చేసి, దాని షూట్ లో జయిన్ అయిన చరణ్, ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నాడు. తొలిసారిగా నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చేస్తున్న చరణ్, దీనితో భారీ హిట్ కొట్టి ఆపై బాలీవుడ్ లో కూడా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

IHG

ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుండగా, సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లేదా, యువ దర్శకుడు సురేందర్ రెడ్డి లలో ఎవరో ఒకరితో చరణ్ తన నెక్స్ట్ సినిమా చేసే అవకాశం ఉందని ఇప్పటికే కొద్దిరోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే అదేదీ కూడా నిజం కాదని, అతి త్వరలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చరణ్ నెక్స్ట్ సినిమా ఉండనుందని టాక్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల, ఇప్పటికే చరణ్ కోసం ఒక అద్భుతమైన స్టోరీ ని సిద్ధం చేసారని అంటున్నారు. 

 

వాస్తవానికి కొన్నేళ్ల క్రితం చరణ్, కొరటాల కాంబోలో తెరకెక్కబోయే సినిమా అధికారిక పూజ కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అయితే ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమా పట్టాలెక్కలేదు. కాగా అప్పుడు మిస్ అయిన సినిమాని అతి త్వరలో కొరటాల చేయనున్నారట. మరోవైపు ఆచార్యలో ముఖ్యమైన విద్యార్థి నాయకుడి రోల్ కోసం చరణ్ ని తీసుకోవాలని చూస్తున్న కొరటాల, అన్ని కుదిరితే నెక్స్ట్ సినిమాని అతి అతి త్వరలో అనౌన్స్ చేయనున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, చరణ్ ఫ్యాన్స్ కు ఇది మంచి పెండుగా వార్తే అని చెప్పకతప్పదు..... !! 

మరింత సమాచారం తెలుసుకోండి: