టాలీవుడ్ లో ఏ హీరో అయినా వంద కోట్లు వసూలు చేస్తే.. అభిమానులు పండుగ చేసుకుంటారు. రికార్డులు, సంచలనాలు అంటూ పోస్టర్లు పడతాయి. అయితే తమిళనాట మాత్రం ఇద్దరు టాప్ హీరోలు ఈజీగా 100కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమా బడ్జెట్ లో 80 పర్సెంట్ కి పైగా అకౌంట్ లో వేసుకుంటున్నారు. మాస్ యాక్షన్ తో కోలీవుడ్ ని ఊపేస్తున్న హీరో విజయ్. ఇళయదళపతిగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ఈ హీరో రెమ్యునరేషన్ తో నిర్మాతలను షేక్ చేస్తున్నాడు. ఒక్కో సినిమాకు వంద కోట్లు తీసుకుంటున్నాడు విజయ్. మాస్టర్ కు విజయ్ 100కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. 

 

విజయ్ నంబర్ వన్ కోసం పోటీపడుతున్నా.. రజినీకాంత్ హవా తగ్గడం లేదు. రోబో తర్వాత ఆ రేంజ్ హిట్ లేకపోయినా తలైవా మార్కెట్ పై చాలా నమ్మకంగా ఉంది కోలీవుడ్. అందుకే దర్బార్ సినిమాకు రజిని 90కోట్ల వరకు తీసుకున్నాడని టాక్. ఇక అన్నాతే కి రజిని 100కోట్లు ఛార్జ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. 

 

రజినీకాంత్, విజయ్ ఇద్దరూ వంద కోట్ల రేంజ్ లో అంటే అజిత్ 60కోట్లు క్రాస్ చేశాడు. అయితే ఈ హీరోలు అంత మొత్తాన్ని రెమ్యునరేషన్ గా కాకుండా షేర్స్ రూపంలో తీసుకున్నారట. సినిమా బిజినెస్ పూర్తయ్యాక తమ వాటా తీసుకుంటున్నారని చెబుతున్నారు. 

 

తమిళనాట రజినీకాంత్, విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే కథ ఎలా ఉన్నా వారిద్దరి సినిమా తెరపై కనిపిస్తే చాలు అభిమానులు అదో మైకంలో థియేటర్ లోవాలిపోతారు. తమ అభిమాన ఏ సినిమా తీస్తున్నారు.. అందులో హీరోయిన్లు ఎవరు.. విలన్లు ఎవరు.. కమెడియన్లు ఎవరు అనే విషయం దగ్గర నుంచి మ్యూజిక్, టెక్నీషియన్, డైరెక్టర్ వరకు అంతా తెలుసుకుంటారు. ఎపుడైతే ఫస్ట్ లుక్.. టీజర్ రు రిలీజ్ అవుతాయో అప్పటి నుంచి వాళ్లలో ఓ రకమైన యాక్సైటింగ్ మొదలవుతుంది. ఇక ఆడియో ఫంక్షన్ లలో వాళ్ల ఆనందాలకు హద్దే ఉండదు. తమ హీరో పాటలను వినీవినీ యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసి పెడతారు. ఇక సినిమా తెరపైకి వచ్చిందంటే చాలు.. వాళ్లకు ఆరోజు ఇక పండుగే. అందుకే రజినీకాంత్, విజయ్ సినిమాలకు ఓరేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే వాళ్లకు 100కోట్ల రెమ్యునరేషన్.  

మరింత సమాచారం తెలుసుకోండి: