హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. బ్రేక్ లేకుండా 5 నుంచి 10ఏళ్లు సినిమాలు చేశారంటే గొప్ప అన్నట్టు ఉంటుంది. ఇలా కష్టంగా కెరీర్ సాగిస్తున్న హీరోయిన్ల పాలిట శాపంలా తయారైంది కరోనా. సీనియర్ల ఫ్యూచర్ ను దెబ్బ కొడుతూ.. స్టార్ హీరోయిన్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది కోవిడ్ 19. 

 

కాజల్ అగర్వాల్ ఇపుడు 34లో ఉంది. పెరిగిపోతున్న ఈ వయసే చందమామ అవకాశాలను దెబ్బకొడుతోంది. చాలామంది హీరోలు థర్టీ ప్లస్ లో ఉందని కాజల్ ని పక్కన పెట్టేస్తున్నారు. స్టార్ హీరోలు అయితే కాజల్ ని ఫస్ట్ ఆప్షన్ గా చూడలేకపోతున్నారు. దీంతో చిన్న సినిమాలు, సీనియర్ హీరోలతో జోడీ కడుతూ కెరర్ నెట్టుకొస్తోంది. ఇలాంటి టైమ్ లో కరోనా ఆమెను మరింత ఇబ్బంది పెడుతోంది. 

 

కాజల్ ఖైదీ నెంబర్ 150తర్వాత కొంచెం స్లో అయినట్టు కనిపించింది. మిత్రవింద ఫేడౌట్ అవుతోందనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే మళ్లీ పుంజుకొని మొత్తం ఆరు సినిమాలకు సైన్ చేసింది. చిరంజీవి ఆచార్య తో పాటు తెలుగు, తమిళ్, హిందీల్లో కలిపి అరడజను వరకు సినిమాలున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్స్ తో బిజీగా కనిపించిన కాజల్ కు ముందుముందు టఫ్ సిట్యువేషన్స్ ఎదురవుతాయనే టాక్ వస్తోంది. 

 

సినిమా ఇండస్ట్రీ కరోనా లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే కాజల్ ఇప్పటికి రెండు, మూడు సినిమాలు పూర్తి చేసేది. కానీ కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ ఆగిపోయాయి.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగ్స్ కు పర్మీషన్ ఇచ్చినా కరోనా దెబ్బకు షూటింగ్స్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ ప్రభావం తగ్గేవరకు షూటంగ్ లకు వెళ్లడానికి హీరోలు ఆసక్తి చూపించడం లేదు. సో కాజల్ కెరీర్ లో ఒక సంవత్సరం వృథాగా పోతుందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: