కరోనాతో సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోతోంది. నిర్మాతలకు కోట్లల్లో నష్టమొస్తుంది. అయితే ఫినాన్షియల్ లాస్ వచ్చినా రికవరీ తీసుకోవచ్చు గానీ.. కెరీర్ కరిగిపోతుంటే సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలి. ఇలాంటి టఫ్ సిట్యుయేషన్ లోనే ఉంది తమన్నా. 

 

తమన్నా గ్రాఫ్ కొన్నాళ్లుగా డౌన్ అవుతోంది. బాహుబలి, సైరా లాంటి భారీ సినిమాల్లో నటించినా మిల్కీ కెరీర్ లో మెరుపులు తగ్గిపోయాయి. ఇంతకు ముందులా క్రేజీ ఆఫర్స్ అందుకోలేకపోతోంది. సీనియర్ హీరోయిన్ అనే ట్యాగ్ తో స్టార్ హీరోలు ఈ బ్యూటీని పక్కన పెట్టేస్తున్నారు. దీంతో కెరీర్ బండిని లాగించేందుకు చాలా కష్టపడుతోంది తమన్నా. 

 

తమన్నా స్టార్ రేసులో స్లో అయ్యాక సీనియర్ హీరోలు, కుర్ర హీరోలతోనూ సినిమాలు చేసింది. బిజీగా ఉండేందుకు కష్టపడుతోంది. ఈ ట్రైల్స్ తోనే తెలుగు, హిందీల్లో కలిపి మూడు సినిమాలు సంపాదించింది. ఈ ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యాక మళ్లీ వేట మొదలు పెట్టాలనుకుంది. కానీ కరోనా ఎఫెక్ట్ మిల్కీ ప్రయత్నాలను దెబ్బకొట్టింది. 

 

తమన్నా ఆల్ రెడీ థర్టీ క్రాస్ చేసింది. సీనియర్ అనే ట్యాగ్ ఉంది. ఇక ఏజ్ బార్ అనే మాటరాక ముందే వీలైనన్ని ఎక్కువ సిినిమాలు చేయాలనుకుంది మిల్కీ. కానీ నిప్పురవ్వ మీద పెట్రోల్ పడ్డట్టు ఏజ్ ఇష్యూకు తోడు కరోనా వచ్చి తమన్నా విలువైన సయాన్ని తినేస్తోంది. షూటింగ్స్ స్టార్ట్ అయ్యే లోపు మిల్కీ వయసును మరో ఏడాది పెంచుతోంది. 

మొత్తానికి తమన్నా కెరీర్ ను కరోనా వైరస్ దెబ్బకొట్టింది. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ భవిష్యత్తుపై ఊహించని విధంగా అటాక్ చేసింది. దీంతో తమన్నాలో ఓ రకమైన ఆందోళన మొదలైంది. కరోనా ప్రభావం తగ్గి షూటింగ్స్ ఎపుడు మొదలవుతాయా అని ఎదురు చూస్తోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: