రాం గోపాల్ వర్మ తీసిన నగ్నం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది శ్రీ రాపాక. కొన్నాళ్లుగా కాస్టూం డిజైనర్ గా పనిచేస్తున్న శ్రీ రాపాక కథానాయిక కావాలన్న ఆమె కోరికను తెర్చాడు ఆర్జివి. నగ్నం సినిమా ఎలా ఉంది.. దాని రిజల్ట్ ఏంటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలాఉంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక స్వీటీ అలియాస్ శ్రీ రాపాక క్రేజ్ బాగా పెరిగింది. అసలు ఇదివరకు ఆమె ఎవరు తెలియదు కాని నగ్నంతో క్రేజ్ తెచ్చుకుంది.

 

ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో కంటెస్టంట్ గా కూడా ఛాన్స్ అందుకుందట. త్వరలో మొదలయ్యే బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టంట్ గా శ్రీకి ఛాన్స్ వచ్చిందట. అయితే అమ్మడు బిగ్ బాస్ నిర్వాహకులకు షాక్ ఇస్తూ రోజుకి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేసిందట. ఆమె ఎన్నిరోజులు ఉంటే అన్ని లక్షలు ఇవ్వాలన్నమాట. శ్రీ రాపాక డిమాండ్ కు షాక్ అయిన బిగ్ బాస్ టీం ఆమె అడిగినంత ఇవ్వలేమని చెప్పారట.

 

అయినా నగ్నం సినిమాతో వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ ఛాన్స్ రావడమే లక్కీ అనుకోవాలి కాని ఆమె అందుకు భిన్నంగా భారీగా డిమాండ్ చేసి ఆఫర్ పోగొట్టుకోవడం బాగాలేదు. బిగ్ బాస్ సీజన్ 4 ఈసారి కంటెస్టంట్స్ విషయంలో నిర్వాహకులు తగ్గట్లేదని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తాడని తెలుస్తుంది. ఆగష్టు చివర్లో కాని సెప్టెంబర్ మొదట్లో కాని బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి టాస్కుల విషయంలో కూడా కొత్తవి ఇంట్రడ్యూస్ చేశారట.                              

మరింత సమాచారం తెలుసుకోండి: