మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా కోలుకోలేని దెబ్బ సినిమా ఇండస్ట్రీకి గట్టిగా తగిలింది. మార్చి నెలాఖరు నుండి దాదాపు నాలుగు నెలలపాటు మల్టీప్లెక్స్ థియేటర్లు దేశవ్యాప్తంగా క్లోజ్ అయిపోయాయి. దీంతో రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా వైరస్ పరిస్థితి బట్టి చూస్తే థియేటర్లు ఇప్పుడప్పుడే ఓపెన్ అయ్యే పరిస్థితి లేదని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సినిమా ధియేటర్ లో ఓపెన్ అయినా గానీ సినిమా ప్రేక్షకులు సినిమా ధియేటర్ కి వచ్చి సినిమా చూసే ప్రసక్తి ఉండదేమో అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో చేతిలో సినిమా కంప్లీట్ అయి ఉండి..., రిలీజ్ చేయలేని నిర్మాతలకు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీ లు ఏకైక మార్గంగా తయారయ్యాయి.

IHG

దీంతో ఓటీటీ వారు ప్రొడ్యూసర్ల కష్టాలను క్యాష్ చేసుకోవడానికి వాళ్లతో  డీలింగ్ విషయంలో కండిషన్స్ పెడుతున్నారట. ఓటీటీలో విడుదల చేయబోయే సినిమాల ప్రొడ్యూసర్స్ కి డబ్బులు ఒకేసారి చెల్లించకుండా రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ఇస్తామని చెబుతున్నారట. ఇంకా అందులో కూడా కొన్ని కండిషన్ లు పెడుతున్నారట. సినిమా పూర్తి కాలం రన్ అయిన తరువాత రెవిన్యూ లో షేర్ ఇచ్చే రీతిని బట్టి షరతులు పెడుతున్నారట.

IHG's Company, Three's a Crowd? Implications of Oodles of Video ...

అంతేకాకుండా ఒక గంటకి 75 పైసల నుంచి తొమ్మిది రూపాయల వరకు మాత్రమే ప్రొడ్యూసర్లకు ఇచ్చే విధంగా ఓటీటీలు తమ రూల్స్ మారుస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. దీంతో ఈ కండిషన్స్ తో చాలావరకు నిర్మాతలు ఇలా అయితే సినిమాలు నిర్మించి లాభం పొందడం చాలా కష్టం అని అంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: