బాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్ బి అమితాబ్ బచ్చన్ 70 ఏళ్ల వయసులో కూడా చాలా చలాకీగా కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తున్నాయి. ముఖ్యంగా 70 సంవత్సరాల వయసులో కూడా హీరోగా అమితాబచ్చన్ కి ఆఫర్లు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఏడు పదుల వయసు కలిగిన వారు నిలబడలేని స్థితిలో పరిస్థితులు మారాయి.

IHG

కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం ప్రపంచానికి భిన్నంగా ఏడు పదుల వయసులో కూడా చాలా యాక్టివ్ గా ఉండటంతోపాటు పూర్తి ఫిట్నెస్ సాధించడానికి బరువు తగ్గేందుకు వర్క్ అవుట్ లు ఈ టైం లో జింలో చేయటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల తన బరువు 90 కేజీలు అంటూ అమితాబచ్చన్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. అయినా ఈ బరువు చాలా కష్టంగా ఉంది త్వరలో తగ్గిపోతా అందుకోసం వర్కౌట్ చేస్తున్నా అంటూ ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

IHG

ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో ప్రజెంట్ ఉన్న కుర్రోళ్ళు అమితాబ్ బచ్చన్ ని చూసి చాలామంది నేర్చుకోవాలి అని ఆయన చేసిన పోస్ట్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యువతరం చాలావరకు ముసలి వాళ్ళ కంటే దారుణంగా తయారవుతున్నారు… అలాంటిది బిగ్ బి 70 వయసులో కూడా బరువు తగ్గాలి అని హెల్త్ మీద చూపిస్తున్న డెడికేషన్ కి చాలామంది హ్యాట్సాఫ్ దొర అంటూ పొగుడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: