ముందుగా తెలుగు సినిమా పరిశ్రమకు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన మాస్ రాజా రవితేజ, అలా ఒక్కొక్కటిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఆపై కొన్నేళ్ల తరువాత శ్రీనువైట్ల తీసిన నీకోసం సినిమాతో హీరోగా మారిన రవితేజ, ఆ సినిమాతో ప్రేక్షకులను బాగానే మెప్పించారు. ఆపై మళ్ళి పలు సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తూ ముందుకు సాగిన రవితేజకు సరిగ్గా 2001లో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా హీరోగా అవకాశం ఇవ్వడం, ఆ సినిమా రిలీజ్ తరువాత మంచి సక్సెస్ అందుకోవడం జరిగింది. 

IHG's film? | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> ...

దానితో ఆపై పూరి దర్శకత్వంలో ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమాలు చేసి మరొక రెండు భారీ హిట్స్ అందుకున్నారు రవితేజ. ఇక అక్కడి నుండి మంచి స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న రవితేజ, ఆనంతరం హీరోగా చాలా విజయాలు దక్కించుకున్నారు. అయితే ఇటీవల కొన్నాళ్ళుగా మాత్రం రవితేజ నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇకపోతే గతంలో తనకు బలుపు వంటి సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్న రవితేజ, ఎలాగైనా ఆ సినిమాతో మంచి హిట్ కొట్టి మళ్ళి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. దీని తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్న రవితేజ, ఇకపై రాబోయే సినిమాలు సక్సెస్ అయ్యేలా గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కెరీర్ పరంగా రవితేజకు మంచి హిట్ అవసరం అని, ఒకవేళ ప్రస్తుతం ఆయన చేస్తున్న క్రాక్, అలానే రమేష్ వర్మ దర్శకత్వంలో చేయబోయే సినిమాల ఫలితం ఏ మాత్రం కాస్త అటుఇటు అయినా, వాటి ప్రభావం పూర్తిగా రవితేజ కెరీర్ పై పడే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి రాబోయే సినిమాలతో రవితేజ ఎంత మేర సక్సెస్ లు అందుకుంటారో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: