తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పటి మహానటి సావిత్రి తరువాత దాదాపుగా అంతగొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటి ఎవరు అంటే, అందరికీ ముందుగా గుర్తుకువచ్చే పేరు దివంగత నటి సౌందర్య అనే చెప్పాలి. తొలిసారిగా గాంధర్వ అనే కన్నడ సినిమా ద్వారా వెండితెరకు అరంగేట్రం చేసిన సౌందర్య, ఆ తరువాత రైతుభారతం సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. అనంతరం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో హీరోయిన్ గా తొలి సూపర్ హిట్ అందుకుని, ఆపై టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుని ముందుకు సాగారు సౌందర్య. 

IHG

అప్పట్లో మన టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సౌందర్య, స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ కూడా కొన్నాళ్ల తరువాత తెలుగు భాషను నేర్చుకున్నారు. మొదటి సినిమా నుండి కూడా ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ, వాటితో ప్రేక్షకులకు ఎంతో చేరువయిన సౌందర్య, స్వతహాగా మంచి అందగత్తె కూడా. ఒకానొక సమయంలో తన అందంతో పాటు ఆకట్టుకునే అభినయంతో ఒకప్పటి సావిత్రి రేంజ్ ఇమేజ్ దక్కించుకున్న సౌందర్య చివరిగా 2004లో తెలుగులో వచ్చిన శ్వేతనాగు, శివ్ శంకర్, అలానే కన్నడలో తెరకెక్కిన ఆప్తమిత్ర సినిమాల్లో నటించడం జరిగింది. 

 

అనంతరం అదే ఏడాది ఏప్రిల్ లో ఒక రాజకీయ పార్టీ ప్రచారం నిమిత్తం హెలికాఫ్టర్ లో బయలుదేరిన సౌందర్య అదే హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆ విధముగా కన్నడ నుండి వచ్చిన సౌందర్య తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు గడించారు. ప్రస్తుతం ఆమె మన మధ్యన లేనప్పటికీ, ఆమె చేసిన సినిమాలు, పోషించిన పాత్రలు మన మనస్సులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: