కరోనా మహమ్మారి వల్ల దేశంలో పరిస్థితులు ఉన్న కొద్దీ ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సినిమా షూటింగులకు ప్రభుత్వాల నుండి అనుమతులు వచ్చిన సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్న దాని విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. చాలా పెద్ద పెద్ద సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదల అవ్వటానికి సిద్ధంగా ఉన్నా గానీ సినిమా థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో రిలీజ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రిష్ సిరీస్ లలో నాలుగో భాగం తెరకెక్కించడానికి డైరెక్టర్ రాకేష్ రోషన్ స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడట.

IHG's Upcoming Superhero Saga To Follow ...

గతంలో క్రిష్ సిరీస్ లలో వచ్చిన మూడు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషలలో విడుదలయ్యి అద్భుతమైన విజయాలు సాధించడం జరిగింది. పైగా తెరకెక్కిన సినిమాలు అన్నీ భారీ బడ్జెట్ తో కూడుకున్నవి. విజువల్ వండర్ గా తెరకెక్కే ఈ సినిమాలు కొన్ని కోట్లతో నిర్మాణం జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్న తరుణంలో ఇలాంటి టైమ్ లో ఇంత భారీ బడ్జెట్ సినిమా అవసరమా అని క్రిష్ 4 స్క్రిప్టు వార్తలపై నెటిజన్లు మండిపడుతున్నారు.

IHG

ఇదిలా ఉండగా క్రిష్ 4 సినిమా నక్షత్ర మండలాల్లోకి ప్రయాణించే థీమ్ చూపించనున్నారట. హృతిక్ సూపర్ హీరో క్యారెక్టర్.. చనిపోయిన తన సైంటిస్ట్ తండ్రి రోహిత్ మెహ్రాను తిరిగి తీసుకురావడానికి ట్రై చేస్తాడని సమాచారం. మరి వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంతో సినిమా యూనిట్ అధికారికంగా స్పందిస్తే గాని తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: