నాచురల్ స్టార్ నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కౌర్, మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు హీరోయిన్ గా తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం శర్వానంద్ కలిసి చేసిన మహానుభావుడు, రవితేజతో చేసిన రాజా ది గ్రేట్ సినిమాలు సూపర్ హిట్ కొట్టి ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. 

IHG

ఆ తరువాత రెండు పంజాబీ, ఒక హిందీ సినిమాలో కూడా నటించిన ఈ భామ, తెలుగులో మాత్రం మంచి అవకాశాలు దక్కించుకుని వాటి విజయాలుగా మలుచుకుని ప్రస్తుతం ముందుకు సాగుతోంది. గతేడాది విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల కలయికలో వచ్చిన ఎఫ్2, అలానే ఈ ఏడాది నాగశౌర్య హీరోగా వచ్చిన అశ్వద్ధామ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న మెహ్రీన్, ప్రస్తుతం ఒక తమిళ, అలానే ఒక తెలుగు సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ భామకు ఇటీవల ఒక భారీ సినిమాలో హీరోయిన్ గా గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. 

 

అతి త్వరలో ఒక స్టార్ హీరోతో బడా దర్శకుడు ఒకరు తీయబోయే సినిమాకు సంబంధించి ఇటీవల కొద్దిరోజులుగా హీరోయిన్ కోసం పలువురిని పరిశీలించిన ఆ సినిమా యూనిట్, ఎట్టకేలకు మెహ్రీన్ కు ఓటేసిందని, అలానే రెండు రోజుల క్రితం, సదరు దర్శకుడు మెహ్రీన్ ను కలిసి సినిమా కథ, కథనాలతో పాటు ఆమె క్యారెక్టర్ వివరించడం, అవి ఎంతో నచ్చిన మెహ్రీన్, సినిమా చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని అంటున్నారు. ఎన్నో రోజుల నుండి ఆ హీరోతో పని చేసే అవకాశం కోసం ఎదురు చూసిన మెహ్రీన్ కోరిక అతి త్వరలో నెరవేరనుందని అంటున్నారు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: