వైవియస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని మొదటి సినిమా 'దేవదాసు' లో గోవా అందాల బ్యూటీ ఇలియానా హీరోయిన్ ఛాన్స్ అందుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘పోకిరి’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకుని ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఆ తరువాత వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి పక్కన నటించిన ఇలియానా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు ఉన్న టైంలో ని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. సౌత్ లో ఎలాంటి అవకాశాలు వచ్చినా వాటిని చేయకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించాలని వెళ్లిన ఇలియానాకి మొదటి అవకాశాలు బాగానే వచ్చినా తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ ఇలియానాని పెద్దగా పట్టించుకోలేదు.

IHG'Cruz flaunting her sexy figure in a black bikini is the ...

అదే సమయంలో ఇలియానా లవ్ లో ఫెయిల్ అవ్వటంతో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. తన ఫిట్నెస్ మొత్తం కోల్పోయింది. అప్పట్లో ఇలియానా ఫోటోలు చూసిన వాళ్లు ఇలియానా ఇంకా పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది అని డిసైడ్ అయిపోయారు. అయితే ఇటీవల ఇలియానా మళ్లీ తన ఫామ్ అందుకుని మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు అందుతున్నాయి.

IHG

ఇందుకోసం తాను పూర్తిగా ఫిట్ గా ఉన్నట్లు రుజువు చేసుకోవడానికి తనకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. సీనియర్ హీరోయిన్ గా ముద్ర పడిపోయిన ఇలియానా అందచందాలు చూసి నెటిజన్లు ఈ పీస్ సీనియర్ హీరోల పక్కన అయితే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: