మోడల్ గా చేస్తూనే అక్కినేని హీరో నాగ చైతన్య సరసన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ ను సినిమా కూడా చేసినా రెండు సినిమాలు పెద్దగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇక ఇలా అయితే కుదరదని భావించి పూరి డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన అందాలతో దుమ్మురేపిన అమ్మడు ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇస్మార్ట్ బ్యూటీగా అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం గల్లా అశోక్ హీరోగా వస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకున్న అమ్మడు నెక్స్ట్ రెండు స్టార్ ఛాన్సులు అందుకున్నట్టు తెలుస్తుంది.

 

ఇక ఈమధ్య ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది అమ్మడు. లవ్ మ్యారేజ్, అరేంజెడ్ మ్యారేజ్ ఈ రెండిటిలో ఏది ఇష్టం అంటే లవ్ కం ఎరేంజెడ్ అంటూ తెలివైన సమాధానం చెబుతుంది అమ్మడు. తనని అమితంగా ప్రేమించే అబ్బాయి భర్తగా కావాలని.. అయితే ప్రేమ మీద నమ్మకం ఉన్నా తనకు ఎవరు పర్ఫెక్ట్ అన్నది తన పేరెంట్స్ చూసుకుంటారని.. వాళ్ల మీద తనకు పూర్తి నమ్మకం ఉందని చెబుతుంది నిధి. అంటే అమ్మడు ఎరేంజెడ్ మ్యారేజ్ కే ఓటేస్తున్నట్టు తెలుస్తుంది. 

 

అయినా కెరియర్ లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న తనకు ఇప్పుడే పెళ్లి ఆలోచన ఏంటి అంటూ నిధి రివర్స్ లో మాట్లాడుతుంది. ఫ్యూచర్లో ప్రేమలో పడొచ్చు.. పడకపోవచ్చు.. కాని మ్యారేజ్ మాత్రం ప్రేమించిన వాడినే తల్లిదండ్రుల ఇష్టంతోనే చేసుకుంటా అంటుంది నిధి అగర్వాల్. ఇదే ఇంటర్వ్యూలో 4వ తరగతిలో ప్రేమ అనుభూతిని పొందానని చెప్పిన ఈ భామ కాలేజ్ డేస్ లో డేటింగ్ కు కూడా వెళ్లినట్టు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: