ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది గోవా బ్యూటీ ఇలియానా. ఆ సినిమా తర్వాత సెకండ్ మూవీనే సూపర్ స్టార్ మహేష్ పక్కన పోకిరి మూవీ ఛాన్స్ అందుకుంది. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన పోకిరి సినిమా అప్పట్లో ఉన్న అన్ని రికార్డులు బద్ధలు కొట్టేసింది. ఇక ఆ సినిమాతో ఇలియానా కూడా వరుస ఛాన్సులు అందుకుంది. ఆ తార్బాత అమ్మడు అందరి స్టార్స్ తో కలిసి నటించింది. టాలీవుడ్ స్టార్ హీరోస్ ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్, రవితేజ, రానా ఇలా అందరితో నటించింది అమ్మడు. 

 

బాలీవుడ్ నుండి ఛాన్స్ రాగానే ఇక్కడ ఫాం లో ఉండగానే అక్కడకి వెళ్లిన అమ్మడు ఆ తర్వత అక్కడ కూడా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. అయితే ఇలియానా మంచి ఫాం లో ఉన్న టైం లో వేరే హీరోయిన్ కు ఛాన్స్ ఇవ్వకుండా ఆమె కోసమే దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. గోవా బ్యూటీ అందానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా అందాల ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు చెప్పని ఇల్లి బేబ్ తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలు చేసింది. 

 

అయితే హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు ఇప్పుడు కెరియర్ లో చాలా వెనుకపడ్డది. బాలీవుడ్ పై ఆశలు పెంచుకున్నా అక్కడ వర్క్ అవుట్ కాలేదు అందుకే మళ్లీ ఇప్పుడు తెలుగులో ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. రెండేళ్ల క్రితం వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇలియానా ఆ సినిమాతో పెద్దగా అలరించలేదు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు.            

మరింత సమాచారం తెలుసుకోండి: