రామ్ గోపాల్ వర్మ అన్న మాటను నెరవేర్చుకున్నాడు. సత్యహరిశ్చంద్రుడుని నిరంతరం అభిమానించే వర్మ ఏకంగా అలాంటి మహోన్నత వ్యక్తుల ఆత్మలు కూడ షాక్ అయ్యే విధంగా వర్మ రోజురోజుకు ప్రవర్తిస్తున్న విచిత్ర తీరును చూసి అతడి అభిమానులు కూడ షాక్ అయిపోతున్నారు.

 

పవర్ స్టార్ పేరుతో సినిమా తీస్తున్నాను అని ప్రకటించి కనీసం కొన్నిరోజు కూడ అవ్వకుండానే నిన్న విడుదల చేసిన ఆమూవీ ఫస్ట్ లుక్ పోష్టర్ ను చూసి ఈ మూవీని ఎలా కట్టడి చేయాలో తెలియక పవన్ వీరాభిమానులు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈమూవీ సినిమా టైటిల్ మధ్యలో గ్లాస్ గుర్తు పెట్టి పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా వ్యక్తిగతంగా తాను టార్గెట్ చేయబోతున్నట్లు వర్మ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాడు.


నిన్న విడుదలైన ఈ మూవీ పోష్టర్ లో పవన్ రూపంలో దిగాలుగా కనిపించే స్టిల్ ఆ పక్కనే "ఎన్నికల ఫలితాల తర్వాతి కథ" అనే ట్యాగ్ ఇవ్వడంతో పవన్ వ్యక్తి గత జీవితంలోకి వర్మ చాల లోతుగా వెళ్ళబోతున్నాడు అని అర్థం అవుతోంది. అయితే ఈ సినిమా అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ సినిమాగా తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లా ఉంటుందా లేదంటే గతంలో వర్మ సాహసంతో తీసిన ‘రక్తచరిత్ర’ లా ఉంటుందా అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.


నిన్న ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోష్టర్ విడుదలైన కొన్ని క్షణాలలోనే ఆ పోష్టర్ వైరల్ గా మారడమే కాకుండా మీడియా వర్గాలకు హాట్ న్యూస్ గామారింది. ఈ పోష్టర్ విడుదలైన కొద్ది సేపటికే వర్మను బూతులు తిడుతూ పవన్ అభిమానులు పోష్టింగ్ లు పెడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ మటుకు వర్మను సపోర్ట్ చేస్తూ మరింత రెచ్చకొడుతున్నారు. వాస్తవానికి ‘శివ’ సినిమాను తీసి తెలుగు సినిమా రంగంలో ఒక ట్రెండ్ ను సృష్టించిన వర్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయి క్లైమాక్స్, నగ్నం సినిమాలతో యువత బలహీనతని సొమ్ము చేసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరు తొలిరోజే ఒ టీటీ లో తన సినిమాను చూస్తే తనకు కోట్లు కురుస్తాయి అని చేస్తున్న ఒక ప్రయత్నానికి ఏవిధంగా అవేసపరులైన పవన్ వీరాభిమానులు అడ్డు కట్ట వేస్తారు అన్నది మరి కొద్దిరోజులలో తేలిపోతుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: