బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చింది. టీజర్ లో బాలయ్య పంచెకట్టు లుక్ అదిరిపోయింది. సింహా, లెజెండ్ తర్వాత మళ్ళీ మంచి హిట్ పడేలా కనిపిస్తుంది. ఈ మేరకు అభిమానుల్లో కూడా నమ్మకం పెరిగింది. అయితే ఈ సినిమాకి మోనార్క్ అనీ, సూపర్ మాన్ అనే టైటిళ్ళని పరిశీలిస్తున్నారు.IHG

 

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా కొత్త అమ్మాయి నటించనుందట. ఈ విషయమై బోయపాటి క్లారిటీ ఇచ్చేసాడు. అందువల్ల అమలాపాల్ నటిస్తుందన్న వార్తలకి ఫుల్ స్టాప్ పడింది. అయితే మరి ఆ కొత్త అమ్మాయిని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారో చూడాలిఉ. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో ఒకానొక కీలక పాత్రలో ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో మెరిసిన పాయల్ ఘోష్ కనిపించనుందట.

IHG

 

మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన పాయల్ ఘోష్, ఆ తర్వాత ఊసరవెల్లి చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. అయితే ప్రస్తుతం తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోందని టాక్. ఆ రీ ఎంట్రీ బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతోనే అని అంటున్నారు. మరి ఇప్పటికైతే ఈ విషయమై అధికారికంగా సమాచారం రాలేదు.

IHG

 

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: