ఈసంవత్సరం చివరకు కరోనా కు వ్యాక్సిన్ కనుక్కోలేని పరిస్థితిలో ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరాంతానికి 20 కోట్లమందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది అని అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా 84 దేశాలలో నిర్వహించిన సర్వే అనేక ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. దీనికితోడు మరొక అంచనా ప్రకారం గాలి నుండి కూడ కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది అన్న విషయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించడంతో సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు కరోనా పేరు చెప్పగానే ఉలిక్కి పడుతున్నారు.


ఈ పరిస్థితుల నేపధ్యంలో ‘పెళ్లి చూపులు’ సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన ప్రియదర్శి పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఒకవైపు కమెడియన్ గా నవ్విస్తూనే మరో వైపున కీలకమైన పాత్రలను అనేక సినిమాలలో చేస్తున్న ఈ సెలెబ్రెటీ బిజీ స్టార్ గా మారినా ప్రస్తుతం సినిమా షూటింగ్ లు లేకపోవడంతో ఇంట్లో ఖాళీగా సమయాన్ని గడుపుతున్నాడు.


‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోగా కూడ తన ప్రయత్నం చేసాడు. ఆ తర్వాత 'మిఠాయి' అనే సినిమాలో లీడ్ రోల్ పోషించాడు. ఇప్పుడు ప్రియదర్శి కరోనాను టార్గెట్ చేస్తూ పెట్టిన ఫన్నీ పోస్ట్ ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది. తన ఇంటి దండెం మీద మాస్క్ మరియు షార్ట్ వేలాడుతున్న ఫోటోను షేర్ చేసిన ప్రియదర్శి ''#ఎస్సెన్షియల్స్ #2020 సో ఫార్'' అని ఫన్నీ క్యాప్షన్ పెట్టాడు.


ఇప్పుడు ప్రియదర్శి షేర్ చేసిన ఈ ఫోటోకు అతడి కామెంట్స్ కు అనేకమంది ప్రశంసలు కురిపిస్తూ అతడి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను అందరు మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ప్రియదర్శి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ చాలామంది ప్రియదర్శి షేర్ చేసిన వస్తువులలో ఒకటి మూతికి రక్షణగా ఉపయోగపడితే మరొకటి మరొకటి దేనికో రక్షణగా ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రియదర్శి వేసిన జోక్ కరోనా రాక్షసికి అర్థం అయితే ఆ రాక్షసి ఈ జోక్ ను ఎంజాయ్ చేస్తుందో లేదో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: