తెలుగు సినిమాల్లో ఉత్తరాది భామలదే హవా. ఎందరో హీరోయిన్లు నార్త్ నుంచి వచ్చి తెలుగులో తమ సత్తా చాటారు. ఇక్కడి నుంచి తమిళ్, హిందీల్లోకి వెళ్లి కూడా రాణించారు. తెలుగులో లాంగ్ కెరీర్ సాధించిన టాప్ హీరోయిన్ ‘శ్రియ శరణ్’. డెహ్రాడూన్ లో పుట్టిన ఈ భామ తెలుగు సినిమాను పుష్కర కాలానికి పైగా ఏలేసింది. డ్యాన్స్, చాలకీ నటన, గ్లామర్, అందం.. శ్రియకు ప్లస్ పాయింట్స్. అప్పట్లో ఆమె చేసిన సినిమాలకు యూత్ ఫిదా అయిపోయారు. దీంతో తెలుగు సినిమా ఆమెను అందలం ఎక్కించింది. త్రిషతో పోటీ పడి రాణించింది.

IHG'at <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HOUSE' target='_blank' title='home-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>home</a> in Barcelona' during quarantine | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> ...

 

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై 2001లో రామోజీరావు నిర్మించిన ‘ఇష్టం’ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో లుక్స్ పరంగా ఓకే కావడంతో తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో శ్రియ పెర్ఫార్మెన్స్, అందంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. అక్కడి నుంచి వరుసగా స్టార్ హీరోల పక్కన అవకాశాలు వచ్చాయి. నాగార్జున సంతోషం, బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి, చిరంజీవి ఠాగూర్, మహేశ్ అర్జున్, పవన్ కల్యాణ్ బాలు.. వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఒక దశలో తెలుగులో టాప్ పొజిషన్ ఎంజాయ్ చేసింది.

IHG'at <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HOUSE' target='_blank' title='home-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>home</a> in Barcelona ...

 

రవితేజతో 2005లో భగీరధ.. తర్వాత 2010 వరకూ తెలుగులో హీరోయిన్ గా చేయలేదు. ఈ గ్యాప్ లో తమిళ్ లో రాణించి అక్కడా టాప్ స్టార్ అయింది. 2010లో డాన్ శీనుతో మళ్లీ తెలుగులో ఎంటరై రాణించింది. స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే స్పెషల్ సాంగ్స్ లో నటించి డ్యాన్స్ పై తన మక్కువ చూపించింది. కెరీర్ స్టార్ట్ అయి 19 ఏళ్లు గడుస్తున్నా, పెళ్లైనా తరగన అందం శ్రియ సొంతం.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: