అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నిత్యామీనన్, ఆ తర్వాత చాలా సినిమాల్లో కనిపించింది. మంచి మంచి విజయాలని అందుకుని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఎన్ని సినిమాలు చేసినా నటనా ప్రాధాన్యమున్న పాత్రలే ఎంచుకునే నిత్యా, గ్లామర్ షోకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన నిత్యా మీనన్, తమిళం, హిందీల్లోనూ కనిపించింది.

 

 

హిందీలో మిషన్ మంగళ్ సినిమాలో ఒకానొక మంచి పాత్ర చేసింది. అయితే తెలుగులో ఆమె కనిపించక చాలా రోజులు అవుతోంది. ఈ మధ్య కొంచెం బొద్దుగా మారిన ముద్దుగుమ్మ ఎక్కువగా సినిమాలని చేయడం లేదు. తమిళ చిత్రమైన సైకోలో కనిపించిన తర్వాత మళ్లీ సినిమాలేవీ ఒప్పుకోలేదు. అయితే ఇండస్ట్రీలో స్నేహితులు దొరకడం చాలా కష్టం. మన మంచి కోరే స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారని చెబుతుంటారు. అయితే అలాంటి స్నేహితుడు నిత్యాకి ఒకరు ఉన్నారట. అతను మరెవరో కాదు దుల్కర్ సల్మాన్..

 

 


నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ ల జోడీకి సిల్వర్ స్క్రీన్ పై మంచి పేరుంది. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకూ మూడు సినిమాలు చేసారు. అందువల్ల వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. దుల్కర్ గురించి మాట్లాడిన నిత్యా, తను మంచి ఫ్యామిలీ మాన్ అనీ, పెళ్ళి చేసుకోకూడదు అనుకున్న తన మనసుకు మార్చి, కన్విన్స్ చేసి పెళ్ళిపై ఆలోచన మార్చుకునేలా చేసాడని తెలిపింది. బ్రీత్ 2 ఇన్ టు ద షాడోస్ వెబ్ సిరీస్ ప్రమోషన్ కి వచ్చిన నిత్యా ఈ మేరకు దుల్కర్ పై ప్రశంసలు కురిపించింది. 

 

 


మొత్తానికి అమ్మడు పెళ్ళిపై పాజిటివ్ గా స్పందించిందటే మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకుంటుందన్న మాట. మరి నిత్యాకి కాబోయేవాడు ఎక్కడున్నాడో..!

మరింత సమాచారం తెలుసుకోండి: