భారతీయ చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన సూపర్ స్టార్ రజినీకాంత్ అరవై ఏళ్లు పడ్డా ఇప్పటికీ యువ హీరోలతో పోటీ పడుతున్నారు.  తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ప్రతి సంవత్సరం ఒక సినిమాతో వస్తున్నారు. అయితే ఒకప్పుడు రజినీ నటించిన సినిమాలంటే నెల రోజుల ముందు నుంచి థియేటర్ల వద్ద జాతర కొనసాగేది.. కానీ ఆ మద్య వరసు ఫ్లాపులు అందుకోవడంతో ఈ జోరు తగ్గిందని అంటున్నారు.  కెరీర్ బిగినింగ్ లో రజినీ సైతం నెగిటీవ్ పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.  కే. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో ఆయన స్థాయి పూర్తిగా మారిపోయింది.  ఒక రకంగా రజినీ కాంత్, కమల్ హాసన్ హీరోలుగా తమిళనాట పాపులర్ కావడానికి కె.బాలచందర్ అని అంటారు.  రజనీకాంత్‌,  కమల్‌హాసన్‌లను  గొప్ప నటులుగా తీర్చిదిద్దిన ఘనత దివంగత దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్‌ దక్కుతుంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘అపూర్వ రాగంగల్‌' సినిమాతో రజనీకాంత్‌ నటుడిగా పరిచయమయ్యారు. 

 

‘అరంగేట్ర’ మూవీతో  కమల్‌హాసన్‌ను హీరోగా పరిచయం చేశారు బాలచందర్‌.   ఇక తమకు సినీ జీవితాన్ని ఇచ్చిన బాలచందర్ గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ గుర్తు చేసుకున్నారు.  తన మససులో మాటలు పంచుకున్నారు.  బాలచందర్‌ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేయకపోయినా నేను నటుడిని అయ్యేవాడిని.  విలన్‌ పాత్రలు, చిన్న క్యారెక్టర్స్‌ చేసేవాడిని.  అదే జరిగితే ఈ పాటికి నన్ను అందరూ ఎప్పుడో మర్చిపోయుండేవారు.

 

బహుషా అలాంటి పాత్రలే వేస్తూ పోతే నన్ను ఎవరూ గుర్తుంచుకొనేవారు కాదు. నటుడిగా నేను ఎవరికి  గుర్తుండకపోయుండేవాడిని. బాలచందర్‌ వల్లే నాకు కీర్తి, పేరుప్రతిష్టలు లభించాయి. నటులతో పాటు ఎంతో మంది గొప్ప సాంకేతిక నిపుణుల్ని చిత్రసీమకు పరిచయం చేశారు. సెట్స్‌లో చిన్న నటుల్ని, సాంకేతిక నిపుణుల్ని గౌరవించే గొప్ప హృదయ ఉన్న మహాన్నత వ్యక్తి ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: