పరభాషా నటీమణులను తెలుగులో తీసుకునే సాంప్రదాయం ఇప్పుడే కాదు ఇండస్ట్రీ ప్రారంభమైన దగ్గర నుంచే ఉంది. ఈ బ్యూటీ కెరీర్‌ తొలి నాళ్లలోనే సూపర్‌ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన సింహాసనం సినిమాలో కీలక పాత్రల్లో నటించింది. అప్పటికే రామ్‌ తేరి గంగా మెయిలీ సినిమాలో ఎద అందాలను ఆరబోస్తూ సంచలన సృష్టించిన కొద్ది రోజుల్లోనే తెలుగుతెర మీద సందడి చేసింది. సింహాసనం సినిమాలో నెగెటివ్ టచ్‌ ఉన్న విష కన్య పాత్రలో అదరగొట్టింది మందాకిని.

 

మందానికి మీరట్‌లో జన్మించిన ఆంగ్లో ఇండియన్‌ కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి జోసెఫ్‌ బ్రిటీష్ వ్యక్తి, ఆమె తల్లి భారతీయ హిందూ స్త్రీ. పుట్టినప్పుడు ఆమెకు పెట్టిన పేరు యాసిన్ జోసెఫ్‌. యాసిన్‌ అనే పేరుతో సినిమాల్లో ప్రయత్నాలు చేసిన ఆమె ముందుగా మూడు సినిమాల్లో రిజెక్ట్ అయ్యింది. ఆ తరువాత మందాకినిగా పేరు మార్చుకున్న వెంటనే ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి.

 

బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఎన్నో సినిమాల్లో నటించింది మందాకిని అదే సమయంలో తెలుగు సినిమాల్లోనూ తళుక్కున మెరిసి ఆకట్టుకుంది. అప్పటి స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ కలిసి నటించి అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో అండర్‌ వరల్డ్ డాన్‌ దావుద్‌ ఇబ్రహింతో మందాకిని కలిసి ఉన్న ఫోటోలు మీడియాలో రావటంలో మందాకిని పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది.

 

కెరీర్ చివరి దశలో మందాకిని చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అవకాశాల కోసం చాలా కాలం ఎదురుచూసిస ఈ సెన్సేషనల్‌ స్టార్‌ అవకాశాలు తగ్గిపోవటంతో తప్పని సరి పరిస్థితుల్లో 1996లో రిలీజ్‌ అయిన జోర్‌దార్‌ సినిమా తరువాత యాక్టింగ్‌కు స్వస్తి పలికింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: