భారతీయ సినిమా వైపు.. మరీ ఆశ్చర్యంగా ఓ రీజనల్ సినిమా వైపు ప్రపంచం ఆశ్చర్యంగా చూసేలా చేసిన సినిమా ‘బాహుబలి’ సిరీస్ సినిమాలే. ఇంతటి అద్భుతాన్ని చేసింది ‘రాజమౌళి’. కథను సినిమాగా చూపే విధానంలో రాజమౌళి టెక్నిక్కే వేరు. ‘బాహుబలి’లో అలా చేసిన మ్యాజిక్కే యావత్ భారతదేశ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నేటికి సరిగ్గా 5ఏళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా కాదు. శివలింగాన్ని భుజంపై ఎత్తుకున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ లో పవరేంటో 2015 జూలై 10న పడిన ఓపెనింగ్ షోతో తెలిసింది.

IHG

 

అక్కడి నుంచి బాహుబలి ప్రభంజనమే సృష్టించింది. భారతదేశం మొత్తం బాహుబలి కలెక్షన్లతో హోరెత్తిపోయింది. ప్రతి సినీ పరిశ్రమలో రాజమౌళి నామస్మరణే జరిగింది. ఒక రీజనల్ సినిమా ఇలా తీయోచ్చా.. తెలుగులో ఇలాంటి దర్శకులు ఉన్నారా అనిపించేంతగా బాహుబలి ఆకట్టుకుంది. ఎత్తైన పర్వతాలు, జాలువారే వాటర్ ఫాల్స్, మాహిష్మతి రాజకోట, బలమైన పాత్రలు, ఆసక్తి రేకెత్తించే కథనం, ప్రభాస్, రానా ఆహార్యం, కాలకేయ యుధ్దం.. ఇలా ఒకదానికి మించి అద్భుతాలతో ‘బాహుబలి’ హోరెత్తిపోయింది. బాహుబలి రిలీజ్ అయిన రెండు వారాలకు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ భజరంగీ భాయిజాన్ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

IHG

 

అయినా బాహుబలి కలెక్షన్లలో తగ్గలేదు. టెక్నాలజీతో రాజమౌళి సృష్టించిన అద్భుతానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. క్లైమాక్స్ లో చూపిన సస్పెన్స్ తో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే క్వశ్చన్ మోగిపోయింది. కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్క మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిసినిమా నిర్మించారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. సినిమా రిలీజ్ అయి 5ఏళ్లు అయిన సందర్భంగా బాహుబలి టీమ్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి మరోసారి ఆ అద్భుతాన్ని కళ్ల ముందు ఉంచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: