బిగ్ బాస్ నాలుగవ సీజన్ గురించి గతకొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కరోనా కారణంగా బిగ్ బాస్ సీజన్ ఉండదేమో అని చాలామంది భావించారు. కానీ ప్రభుత్వం షూటింగులకి అనుమతులు ఇచ్చిన కారణంగా బిగ్ బాస్ యాజమాన్యం సీజన్ 4 మొదలెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ నాలుగవ సీజన్ కి కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మేరకు కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వచ్చాయి.

 

అయితే నాలుగవ సీజన్ లో కంటెస్టెంట్లుగా ఎవరు వస్తున్నారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రియా వడ్లమాని, యామినీ భాస్కర్, హంసా నందినీ, శ్రద్ధా దాస్ మొదలుగు పేర్లు ఈ లిస్టులో వినిపించాయి. తాజాగా ఈ లిస్టులో మరో పేరు కూడా కలిసింది. కమిట్మెంట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రమ్య పసుపులేటి కూడా బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో కంటెస్టెంట్ గా రానుందట.

IHG's Wiki, Age, Height, Physical Appearance, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HUSBAND' target='_blank' title='husband-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>husband</a>,  Boyfriend, Family, Relationship, Biography, Facts, Photos, Videos & More in  <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=2020' target='_blank' title='2020-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>2020</a> | Celebrity biographies, Biography, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIAN' target='_blank' title='indian-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>indian</a> actresses

లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్న కమిట్మెంట్ చిత్రం సినిమా ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి చర్చించనుంది. కమిట్మెంట్ ఉంటే తప్ప సినిమాలో క్యారెక్టర్ ఉండదు అన్న రీతిలో ప్రవరిస్తున్న కొందరి గురించి చాలా నిక్కచ్చిగా చూపించనుందట. అయితే ఈ సినిమాలో రమ్య పసుపులేటితో పాటు తేజస్వి మాదివాడ, అన్వేషి జైన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. తేజస్వి మాదివాడ బిగ్ బాస్ రెండవ సీజన్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

 

మరి ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం రమ్య పసుపులేటి బిగ్ బాస్ లో కనిపించనుందో లేదో చూడాలి. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ స్టార్ట్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: