నేహా శర్మ... టాలీవుడ్ లో ఒక్క సినిమాతో బాగా పాపులర్ అయిన భామ. అవును ఆమె ఒకే ఒక్క సినిమాతో బాగా పాపులర్ అయింది అనే చెప్పాలి. రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా రామ్ చరణ్ కి మొదటి సినిమా ఆమెకు కూడా మొదటి సినిమానే. ఆమె అగ్ర హీరోలతో చేసే స్టార్ హీరోయిన్ అవుతుంది అని భావించినా సరే ఆమె మాత్రం సినిమాలు చేయలేదు. ఇక ఆమె కొందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా సరే ఎక్కువగా డిమాండ్ చేసింది అని అన్నారు. 

 

ఇక ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. అక్కడ వరుస ఆఫర్ల కోసం ఆమె ప్రయత్నాలు చేస్తుంది. చిన్న చిన్న సినిమాల్లో ఆమె నటిస్తుంది. స్టార్ హీరోల సినిమాలు అయినా సరే చాలా  వరకు జాగ్రత్తగానే ఆమె సినిమాలు చేస్తుంది అని చెప్పాలి. రాబోయే రెండు మూడేళ్ళ పాటు ఆమె మంచి సినిమాలే చేసే అవకాశం ఉంది అనే ప్రచారం మాత్రం బాగానే జరుగుతుంది. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లు కొందరు  ఆమెతో విభేదించారు అని ఆమె సినిమాలు అందుకే పెద్దగా రావడం లేదు అని కూడా అంటున్నారు. 

 

ఆమె సొంత రాష్ట్రం బీహార్. అక్కడి నుంచి వచ్చిన ఆమె తెలుగు లో కూడా సినిమా చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే ఆమె పెద్దగా కాపాడుకోలేదు అనే చెప్పాలి. మన తెలుగు లో దాదాపుగా ఆమె  మొదటి సినిమాకే ఆమెను అభిమానించారు. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకునే ఆలోచన లో ఉంది అని కూడా అంటున్నారు మరి. అది నిజమా కాదా అనేది చూడాలి. తెలుగు లో ఒక సినిమా చేస్తుంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: