టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అయింది సమీరా రెడ్డి. ఆమె చాలా వరకు కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది గాని కొన్ని కొన్ని వ్యవహారాలతో ఆమె కాస్త మసకబారింది అనే చెప్పాలి. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలతో పాటు గా ఆమెకు డాన్స్ రాదు అనే పేరు కూడా ఆమెను బాగానే ఇబ్బంది పెట్టింది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆమె స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉన్నా సరే నిలబెట్టుకునే విషయంలో కాస్త అలసత్వం ప్రదర్శించింది. అందుకే ఆమెను స్టార్ హీరోలు కూడా పక్కన పెట్టారు. 

 

స్టార్ దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వాలి అని భావించినా సరే ఆమె మాత్రం చేయలేదు సినిమాలు. ఇక  ఆమె సొంత రాష్ట్రం మహారాష్ట్ర. ఆమె మహారాష్ట్ర రాజధాని ముంబై నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చి ఆమె వరుసగా సినిమాలు చెయ్యాలి అని చూసింది. తమిళం లో ఆమె రెండు మూడు సినిమాలు చేసినా సరే ఆమె పెద్దగా పేరు తెచ్చుకోలేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఆమెకు అవకాశాలు ఇచ్చే వారు కూడా ఎవరు లేరు మరి. ఇక ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అవ్వలేదు గాని నిర్మాత అవ్వాలి అని భావిస్తుంది. 

 

క్రికెటర్ లతో ఆమెకు ప్రేమ వ్యవహారాలూ బాగానే ఉన్నాయి అప్పట్లో. ఇక అవే ఆమె కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టాయి అనే వారు కూడా ఉన్నారు మరి. అది నిజమా కాదా అనేది తెలియదు. ఆమె హీరోయిన్ గా కాకపోయినా సరే కొన్ని కొన్ని మంచి పాత్రలు చెయ్యాలి అని చూసినా సరే ఆమెను పెద్దగా ఎవరూ కూడా పట్టించుకోలేదు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: