టాలీవుడ్ లో నివేదా థామస్ అనగానే చాలా మందికి ఆమె నవ్వు గుర్తుకు వస్తుంది. ఇక చిన్న వయసు లోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె వరుస ఆఫర్లతో దాదాపు మూడు భాషల్లో తన మార్క్ ని చూపించింది అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు దాదాపుగా అన్నీ చెస్ ఆమె తన  మార్క్ ని వేసింది అనే సంగతి అందరికి తెలిసిందే. ఇక అగ్ర హీరోల సినిమాల్లో ఆమె చాలా ఫాస్ట్ గా ఆఫర్లు తెచ్చుకుంది అనే మాట వాస్తవం. ఇప్పుడు ఆమెకు కాస్త డిమాండ్ తగ్గింది గాని ఆమె సినిమాలు మొదలు పెట్టిన కొత్తలో అయితే ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. 

 

నటన లేదు అనే ఆరోపణలు ఉన్నా సరే ఆమెను మాత్రం స్టార్ హీరోల సినిమాలకు తీసుకునే వారు. ఇక ఆమె కూడా తన స్థాయి ని కాపాడుకోవడానికి కాస్త ఎక్కువగానే కష్టపడింది అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె రెండు మూడు సినిమాలు చేస్తుంది గాని ఈ రెండు మూడు సినిమాలు లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి. ఈ రెండు మూడు సినిమాల్లో కూడా ఆమె పాత్ర రెండో హీరోయిన్ అని టాక్. ఇక ఆమె సొంత రాష్ట్రం కేరళ. అక్కడి నుంచి ఆమె మన తెలుగు లో వచ్చింది. ఇక తమిళం లో కూడా ఆమె దాదాపుగా పది సినిమాల వరకు చేసింది. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమెకు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆఫర్ వచ్చింది అనే ప్రచారం జరుగుతుంది గాని అది నిజం కాదు అని అంటున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు ఆఫర్లు ఆగిపోయాయి అని చిన్న హీరోల సినిమాల్లో మాత్రమే వస్తున్నాయి అని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: