తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ చిత్రాల్లో మొదటి స్థానం కైవసం చేసుకున్న సినిమా.. బాహుబలి. అప్పటి వరకూ ఎవ్వరూ ఊహించని రీతిలో, అసలు అంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే వర్కౌట్ అవుతుందా అనే సందేహాలున్న సమయంలో, బాలీవుడ్ కూడా బడ్జెట్ పెట్టడానికి శంకించిన రోజుల్లో, తెలుగు ఇండస్ట్రీ నుండి వచ్చిన బాహుబలి చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. వెండితెర మీద దృశ్యకావాన్ని చిత్రీకరించిన రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

అప్పటి వరకూ తెలుగువారికి మాత్రమే డార్లింగ్ అయిన ప్రభా బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా డార్లింగ్స్ ని సంపాదించుకున్నాడు. నేటితో బాహుబలి సినిమా రిలీజై ఐదేళ్ళు పూర్తి కావొస్తుంది. తెలుగు సినిమా చరిత్రని తిరగారాసిన బాహుబలి చిత్రానికి ఐదేళ్ళు నిండాయి. ఒకటి కాదు రెండు కాదు సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో రోపొందిన ఈ చిత్రం అన్ని భాషల్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

 

హాలీవుడ్ చిత్రాలని చూసి మన వాళ్ళు ఇలా ఎందుకు తీయట్లేదన్న ప్రశ్న కలిగిన వారందరికీ, మనవాళ్ళు అలాంటి సినిమా తీస్తే ఏ రేంజ్ లో ఉంటుందో చూపించిన సినిమా బాహుబలి. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా మార్కెట్ చాలా పెరిగింది. మన కథల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకూ ఫార్ములా బేస్డ్ సినిమాలని తెరకెక్కించే వారు సైతం తమ పంథాని మార్చుకుని అప్డేట్ అయ్యారు.

 

ఐతే బాహుబలి ద బిగినింగ్ రిలీజై ఐదు సంవత్సరాలు కావొస్తున్న సందర్భంగా ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ స్టార్ట్ చేసారు. ప్రభాస్ ఈ ఐదేళ్ల సంబరంలో పాలు పంచుకున్నాడు. నిన్న రాత్రి ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఈ మ్యాజిక్ క్రియేషన్ లో పార్ట్ అయిన టీమ్ అందరి పేర్లని ట్యాగ్ చేసాడు. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: