టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నా సరే వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న హీరోయిన్ రాశీ ఖన్నా. మంచి స్టార్ హీరోయిన్ గా అవకాశం వచ్చినా సరే ఆమె మాత్రం తన పేరు ని కాపాడుకోలేకపోతుంది. ఇక ఆమె సినిమాలు ఆమె నటన  ఫాన్స్ కి అంత బాగా నచ్చడం లేదు. ఆమె అందం చూపించినా సరే ఆ అందం చూసే వాళ్లకు బోర్ కొడుతుంది అని అందుకే ఆమె ఇప్పుడు రావడం లేదు అని అంటున్నారు. ఎన్టీఆర్ తో చేసినా మరో హీరో తో చేసినా సరే ఆమె మాత్రం తెలుగు లో ఎక్కువగా నిలబడటం లేదు. ఆమె వచ్చి ఏడేళ్ళు అయింది. 

 

అయినా సరే ఇప్పటికి కూడా సినిమాలు చేయడానికి బాగానే ఇబ్బంది పడుతుంది అనే చెప్పాలి. ఇక ఆమె సొంత రాష్ట్రం ఢిల్లీ. ఆమె చదువు లో చాలా ఫస్ట్  అని అంటారు. ఆమె టాలీవుడ్ లో ఇంకా నిలబడటం లేదు అంటే కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆమె సొంత రాష్ట్రం వెళ్ళిపోయే ఆలోచనలో ఉంది అని అంటారు. ఆమె సొంత రాష్ట్రం వెళ్ళిపోయే ఆలోచనలో ఉంది అనే వార్తలు కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి మరి  ఆమెకు స్టార్ హీరోలు చిన్న హీరోలు ఎవరూ కూడా ఆఫర్ ఇచ్చే పరిస్థితి అయితే దాదాపుగా లేదు అనే చెప్పాలి మరి. 

 

ఇప్పుడు ఆమె కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది తెలియదు. రామ్ చరణ్ తో ఆమె ఒక సినిమా చేస్తుంది అని అన్నారు గాని అది సాధ్యం అయ్యే అవకాశాలు కనపడటం లేదు. మరి ఆమె ఏ సినిమాలో చేస్తుంది ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: