టాలీవుడ్ లో ఇతర భాషల నుంచి వచ్చిన చాలామంది హీరోయిన్లు తమ హవా నడిపిస్తున్న వారు ఉన్నారు. అయితే ప్రతి ఒక్క హీరోయిన్ తమదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇక తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తు దర్శక నిర్మాతలను తమ వైపు తిప్పుకుని  వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇక వివిధ భాషల నుంచి వచ్చినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు కూడా వారిని ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రాశి కన్నా. ముద్దుగా బొద్దుగా ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉండే  హీరోయిన్ రాశిఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.



ఇక ఆ తర్వాత జిల్ సినిమా తో వెండితెరపై మంచి గుర్తింపు సంపాదించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. వరుస అవకాశాలు అందుకుంటూ అంతకంతకూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రాశి  కన్నా . అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని హవా నడుస్తున్న ఈ ముద్దుగుమ్మ ఢిల్లీ భామ. ఢిల్లీకి చెందిన రాశి కన్నా తెలుగు చిత్ర పరిశ్రమకు ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమై ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది . తన చిలిపి నవ్వుతో తెలుగు ప్రేక్షకుల అందరి మనసులను కొల్లగొట్టింది.


అయితే మొదట ఐఏఎస్  ఆఫీసర్ కావాలనుకున్న రాశి కన్నా ఆ తర్వాత మనసు మార్చుకుని బాలీవుడ్ లో మద్రాసు కేఫ్ అనే సినిమాలో నటించింది.  ఈ సినిమా విజయంతో మంచి హిట్ సాధించింది. ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రాశికన్నా .


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: