తెలుగు చిత్రపరిశ్రమలో ఇతర భాషలకు చెందిన హీరోయిన్ల హవా ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే, ఇతర భాషల నుంచి వచ్చిన చాలామంది హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తన అందచందాలతో నటనతో తెలుగు ప్రేక్షకులను మైమరపింప  చేస్తున్న హీరోయిన్లందరూ ఇతర భాషలకు చెందిన వాళ్లే అనడంలో అతిశయోక్తి లేదు.



ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా తమ హవా నడిపించారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన  హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఆ ఆ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అనుపమపరమేశ్వరన్  ఆ తర్వాత ఎంతో మంది హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఓవైపు నటనతో అలరిస్తునే  మరోవైపు తనదైన అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.



అయితే అనుపమ కేరళ రాష్ట్రానికి చెందింది. కేరళ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత ఎంతగానో గుర్తింపు సంపాదించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. చూడగానే లావణ్యంతో కట్టిపడేసే అందం.. చూపులు తిప్పుకోలేని అభినయం ఆమె సొంతం.. నటనలో హొయలు మాటల్లో పదనిసలు పలికిస్తూ కుర్రకారును హుషారెత్తిస్తున్నది  ఈ ముద్దుగుమ్మ.. ఇలా తనదైన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెలను జారవిడిచేలా  చేసింది. తెలుగు తమిళ కన్నడ మలయాళ చిత్రాల్లో కూడా ఈ అమ్మడికి ఎంతో క్రేజ్ వుంది. కేరళ రాష్ట్రంలోని త్రిశూల్ జిల్లాకు చెందింది అనుపమ. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకున్న అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కుర్రకారులో ఏ హీరోయిన్ కు లేనంత  ఫాలోయింగ్ అనుపమ పరమేశ్వరన్ సొంతం.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: