ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అందాల ముద్దుగుమ్మలు హీరోయిన్ లుగా  తన సత్తా చాటుతూ ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుని  ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లలో దాదాపుగా అందరూ తెలుగుకు సంబంధించిన వాళ్ళ కంటే వివిధ భాషల నుంచి టాలీవుడ్  చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ఉన్నారు.



తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ మంది. అయితే ఇప్పుడు వరకు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వారు ఎందరో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇలా వేరే భాష నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోయిన్ గా తన హవా నడిపించిన హీరోయిన్ త్రిష. త్రిష టాలీవుడ్ లో ఎంతటి గుర్తింపు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు టాలీవుడ్లోని స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు... తమిళంలో పలు సినిమాల్లో నటించి తెలుగు చిత్రపరిశ్రమలో తరుణ్ సరసన నీ మనసు నాకు తెలుసు అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.



 ఆ తర్వాత సూర్య హీరోగా నటించిన ఆరు సినిమా అటు తమిళంలో ఇటు తెలుగులో కూడా మంచి విజయం సాధించడంతో త్రిష  మంచి గుర్తింపు సంపాదించింది. ఇక ఆ తర్వాత త్రిష తన చిలిపి నవ్వుతోనే దర్శకనిర్మాతలు అందరినీ ఫిదా చేసి ఏకంగా వరుస  అవకాశాలను అందుకుంది. వర్షం నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ కొట్టేసి వరుస సినిమాలు చేస్తూ క్రమక్రమంగా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో త్రిషా తన హవా నడిపించింది అని చెప్పాలి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సరసన ఛాన్స్ వచ్చినప్పటికీ వివిధ కారణాలతో ఆ సినిమా నుంచి తప్పుకుంది. మరి మళ్లీ టాలీవుడ్ లోకి త్రిష ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి మరి.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: