టాలీవుడ్ లో ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటన గాని ఆమె సినిమాలు గాని జనాలకు బాగానే నచ్చాయి.  అయితే ఆమె మాత్రం తనకు వచ్చిన పేరు ని ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేదు అనే మాట మాత్రం వాస్తవం. స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేసే అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం పెద్దగా అవకాశాలను కాపాడుకోలేదు. అయితే ఇక ఆమె  ఇప్పుడు వరుసగా సినిమాలు చెయ్యాలి అని ప్రయత్నాలు చేస్తుంది అని తెలుస్తుంది. రెండు మూడు సినిమాల్లో ఆమె నటించే అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తుంది. 

 

అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి పక్కకు పోతున్నాయి. మరి దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆమె మాత్రం ఇప్పుడు చాలా వరకు అవకాశాల కోసం కష్టపడుతుంది. గోవా బ్యూటీ గా ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ పేరు ఆమెను బాగాన్ ఫాన్స్ ని కూడా  సంపాదించింది అనే చెప్పాలి. గోవా నుంచి వచ్చిన ఆమె  చాలా వరకు స్టార్ హీరోలు అందరి తో కూడా మంచి సినిమాలు చేసింది. అయితే ఆమె కొన్ని కొన్ని వ్యవహారాలతో తెలుగు లో వచ్చిన అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది అని చెప్పాలి. 

 

ఇక ఇప్పుడు ఆమె మన తెలుగు లో రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా ఆమెను నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తుంది. మరి ఆమెకు ఏ విధంగా  అవకాశాలు భవిష్యత్తు లో వస్తాయి అనేది చూడాలి. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది అని కూడా అన్నారు గాని మరి ఏమైందో ఏమో ఆమె తెలుగు లో వరుసగా సినిమాలు చేసింది మళ్ళీ. ఇప్పుడు కూడా అదే ప్రయత్నాల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: